గ్లోబరీనా తన బినామీ సంస్థ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఇప్పటికే పరువు నష్టం నోటీసులు పంపానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన పోలీస్‌స్టేషన్లు- కొన్నిచోట్ల మామూళ్లకు కేంద్రాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రేషన్‌దుకాణాలలో లబ్ధిదారులు కేవైసీ చేసుకోవడానికి సాంకేతిక సమస్యలు అడ్డువస్తున్నాయి.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చరిత్రలో ధాన్యానికి క్వింటాకు ఆల్‌టైం రికార్డు ధర నమోదైంది.
అసమానతలు, అన్యాయాల మీద అగ్నిధారలు కురిపించిన కవితా సారథి దాశరథి. నిజాం నియంతృత్వంపై అక్షర క్షిపణులు సంధించిన చైతన్య వారధి.
గిరిజన విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయడానికి.. వారికి ఉత్తమవిద్యను, క్రమశిక్షణతో కూడిన విలువైన జీవితాన్ని అందించడానికి, సైనిక ఉద్యోగాలు సాధించడానికి చక్కని వేదిక వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్ గిరిజన సైనిక్‌స్కూల్.
ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ములుగు జిల్లా తాండూరు మండలంలో స్వామీజీ ముసుగులో గంజాయి సాగు చేస్తున్న ఓ సాధువును పోలీసులు అరెస్టు చేశారు.
వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. బొల్లికుంట చౌరస్తాలో అర్ధరాత్రి శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదానికి దారి తీసింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పసుపు గరిష్ఠ ధర రికార్డు స్థాయిలో క్వింటాకు రూ.16,159గా నమోదైంది.