ETALA RAJENDER: కాంగ్రెస్‌కి కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్న బీసీలు: ఎంపీ ఈటల
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:02 PM
తమను అన్యాయం చేసినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీలు కత్తులు నూరుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు ఉండవని.. గెలిచిన వారిని కాంగ్రెస్ నుంచి గెలిచారని చెప్పుకుందామని భావిస్తున్నారేమో అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు.
హనుమకొండ, నవంబర్ 28: బీసీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మల్కా్జ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. ఓట్ల కోసం ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండలో ఎంపీ ఈటల రాజేందర్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై వెనక్కి తగ్గినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన డిమాండ్ చేశారు. తమకు అన్యాయం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీలు కత్తులు నూరుతున్నారన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు ఉండవని.. గెలిచిన వారిని కాంగ్రెస్ నుంచి గెలిచారని చెప్పుకుందామని భావిస్తున్నారేమో అంటూ సందేహం వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ చేసిన మోసానికి బీసీలు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని...హామీ ఇచ్చేటప్పుడు తెలియదా? అంటూ అధికార పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. బీసీల జనాభా ఎంతో తేల్చకుండా రిజర్వేషన్లు ఎలా చేస్తారంటూ కాంగ్రెస్ సర్కారును ఆయన సూటిగా ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో నాడు బీఆర్ఎస్ భూములు లాక్కున్నట్టే నేడు కాంగ్రెస్ పార్టీ లాక్కుట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ భూ కుంభకోణాలకు హద్దు లేదు.. దీనికి మూల్యం చెల్లించక తప్పదంటూ ఎంపీ ఈటల హెచ్చరించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోనే అధిక భూములు లాక్కుంటున్నారంటూ సోదాహరణగా వివరించారు. భూముల కోసమే జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధి విస్తరించినట్లు అయితే.. దాని కంటే దరిద్రం ఇంకోటి లేదని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీలో తెలంగాణ పోలీసుల ఆపరేషన్.. వెలుగులోకి సంచలన విషయాలు
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్
For More TG News And Telugu News