Share News

Good News for Ayyappa Devotees: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:26 PM

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ శుభవార్త చెప్పింది. విమానాల్లో చెకింగ్‌ లేకుండా ఇరుముడి తీసుకెళ్లేందుకు అయ్యప్ప భక్తులకు వెసులుబాటు కల్పించింది. నేటి నుంచి అంటే శుక్రవారం (28-11-2025) నుంచి వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

Good News for Ayyappa Devotees: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్

అమరావతి, నవంబర్ 28: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు. విమానాల్లో చెకింగ్‌ లేకుండా ఇరుముడి తీసుకెళ్లేందుకు అయ్యప్ప భక్తులకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. నేటి నుంచి అంటే శుక్రవారం (28-11-2025) నుంచి వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు భక్తులకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా అయ్యప్ప మాల వేసుకున్న భక్తులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు.

ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా ఆయన వెల్లడించారు. దీనికి తన వీడియోను సైతం జత చేశారు. తాజాగా పౌర విమానయాన శాఖ మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ఏటా లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. వారు సైతం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జాక్‌పాట్ కొట్టనున్న ఈ రాశులు.. పట్టిందల్లా బంగారమే..!

ఢిల్లీలో తెలంగాణ పోలీసుల ఆపరేషన్.. వెలుగులోకి సంచలన విషయాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 28 , 2025 | 05:17 PM