Assault on Driver at Narsampeta: నర్సంపేటలో మందుబాబుల వీరంగం.. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
ABN , Publish Date - Nov 26 , 2025 | 10:12 AM
ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నర్సంపేటలో కొందరు యువకులు తాగిన మైకంలో బూతులు మాట్లాడుతూ ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు.
మహబూబాబాద్ జిల్లా, నవంబర్ 26: రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల హకీంపేట డిపో సిబ్బందిపై కొందురు దుండగులు దాడికి పాల్పడిన ఘటన మరవక ముందే.. తాజాగా నర్సంపేటలో ఓ ఆర్టీసీ డ్రైవర్‌పై మందుబాబులు వీరంగం సృష్టించారు. తాము ఎమ్మెల్యే బంధువులమని చెప్పుకుంటూ మద్యం మత్తులో నానా హంగామా చేశారు.
ఏం జరిగిందంటే.?
మంగళవారం రాత్రి కొందరు వ్యక్తులు హైదరాబాద్ నుంచి మహబూబాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు. డ్రైవర్ పక్కనే ఉన్న గేర్ బాక్స్‌పై కూర్చొన్నారు. ఇంతలో తాము ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి బంధువులమంటూ హంగామా స్టార్ట్ చేశారు. తాగిన మైకంలో బూతు పురాణం మాట్లాడుతూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించారు. దీనిని అడ్డుకోబోయిన ఆర్టీసీ డ్రైవర్‌పై గొడవకు దిగారు. అనంతరం ఆయనపై దాడి చేశారు. దీంతో బాధిత డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన యువకులను డ్రైవర్, ప్రయాణికులు పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: