కేసీఆర్ సభల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఇచ్చారా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సచివాలయానికి వెళ్తే గేట్లకు తాళం వేసి అడ్డుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఆదిలాబాద్‌కు మళ్లీ వస్తానని.. రోజంతా సమస్యలపై సమీక్షిస్తానని తెలిపారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్‌లో ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతోందని వివరించారు.
సినిమా పైరసీకి పాల్పడ్డ ఇమంది రవి అలియాస్ ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్‌కు సంబంధించి తాజాగా నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్, కస్టడీ పిటిషన్లపై నాంపల్లి కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు ఇవ్వనుంది.
తెలంగాణతో పాటు దేశంలో చాలా రాష్ట్రాల్లో కోతుల సమస్యలపై బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. వానరాల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
ఐదు లక్షల కోట్ల కుంభకోణంపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించిందని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రజల ఆస్తిని సరైన పద్ధతిలో వినియోగించాలని సూచించారు.
బీఆర్‌ఎస్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్ రగిల్చి బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
హిడ్మా ఎన్‌కౌంటర్‌పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో సంచలన లేఖ విడుదలైంది. హిడ్మా, శంకర్లు అనారోగ్యం కారణంగా చికిత్స కోసం వస్తే పోలీసులు పట్టుకుని చంపేశారని ఆరోపించారు.
తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన రెండు వెబ్ సైట్లు హ్యాక్‌కు గురయ్యాయి. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్‌సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంతో వారం రోజులుగా వెబ్ సైట్లు పని చేయని పరిస్థితి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలన్నీ నేడు నీటి మూటలుగానే మిగిలిపోయాయన్నారు. రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేయడవలో దిట్టగా మారిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతాచారి పేరును ఒక్క పథకానికైనా ఎందుకు పెట్టడం లేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ప్రస్తుత పాలకులకు రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ గుర్తుకొస్తున్నారు కాని శ్రీకాంతాచారి గుర్తుకు రాకపోవడం దారుణమన్నారు.