kumaram bheem asifabad- అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Feb 21 , 2026 | 10:47 PM
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి శనివారం జిల్లా అధికారులు, పంచాయతీ రాజ్, రహదారి భవనాల శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు, గ్రామీణ ఉపాధి హామీ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులు, ఎంఈవోలతో చేపట్టిన అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి శనివారం జిల్లా అధికారులు, పంచాయతీ రాజ్, రహదారి భవనాల శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు, గ్రామీణ ఉపాధి హామీ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులు, ఎంఈవోలతో చేపట్టిన అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 వరకు ముగియనున్నందున పనులను వేగవంతం చేసి పూర్తై పనుల బిల్లుల ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. సంబంధిత అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీఓలు, సమన్వయంతో పని చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామి పథకం కింద మంజూరైన గ్రామ పంచాయతదీ కార్యాలయ భవనాలు, గ్రామ సమైఖ్య భవనాలు, ఫుడ్ గైయిన్స్ గోదాం, వంట శాలల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి మార్చి మాసాంతం లోగా పూర్తి చేయాలని తెలిపారు. అంగన్‌వాడీలలో మూత్రశాలల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన పనులను త్వరగా పూర్తి చేయాలని, ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన పాఠశాలల అదనపు తరగతి గదులు, రహదారుల పనులు, వంతెనలు, కల్వర్టుల నిర్మాణాలు, బీటీ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. సంపూర్ణత అభియాన్ కింద ప్రధాన మంత్రి జన్‌మన్, పీఎం జుగా కింద చేపట్టిన పనులను పూర్తి చేయాలని, పీఎం జుగా కింద అంగన్‌వాడీ కేంద్రాలకు పీవీటీజీ ఆవాసాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. పాఠశాలలో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. వేసవిలో తాగునీటి ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని, అవసరమైన మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. సిర్పూర్(యూ), లింగాపూర్, తిర్యాణి మండలంలోని మారు మూల గిరిజన గ్రామాలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా గ్రామీణ నీటి సరఫరా శాఖ, ఇంజనీరింగ్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతి సాధించాలని చెప్పారు. ఇంకా ప్రారంభం కాని ఇళ్ల పనులను లబ్ధిదారులతో మాట్లాడి ప్రారంభించాలని తెలిపారు. 15వ ఆర్థిక ప్రణాళిక కింద చేపట్టిన పనులను మార్చి 31లోగా పూర్తి చేసి బిల్లులు చెల్లించాలని తెలిపారు. అనంతరం మండలాల వారీగా చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో ఆయాశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.