kumaram bheem asifabadబల్దియాల ఆదాయ వనరులు ఇలా..
ABN , Publish Date - Feb 21 , 2026 | 10:50 PM
పట్టణాలు, నగరాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు పురపాలక సంఘాలు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. వాటికి అందే ఆదాయ వనరులను ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): పట్టణాలు, నగరాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు పురపాలక సంఘాలు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. వాటికి అందే ఆదాయ వనరులను ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించారు.
ఫ సొంత పన్ను ఆదాయం..
ప్రజల నుంచి నేరుగా వివిధ రకాల పన్నులు వసూలు చేస్తారు. ఈ నిధులతో వివిధ అభివృద్ది పనులు చేపట్టి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తారు.
- ఆస్తిపన్ను: ఇది పురపాలక సంఘాలకు అతిపెద్ద ఆదాయ వనరు. ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, ఖాళీ స్థలాలపై ఆస్తిపన్ను విధిస్తారు. యాజమానుల నుంచి నిబంధనల ప్రకారం వసూలు చేస్తారు.
- ప్రకటనలు: వ్యాపార, విద్యా తదితర సంస్థలు హోర్డింగులు, సైన్‌బోర్డులు ఏర్పాటు చేస్తుంటారు. వాటిని ఏర్పాటు చేసిన సంస్థల యాజమానుల నుంచి వసూలు చేస్తారు.
- వృత్తి: ఉద్యోగులు, వ్యాపారుల నుంచి వృత్తిపన్ను వసూలు చేస్తారు. ఉద్యోగుల నుంచి వేతనంలో కోత విధిస్తారు. ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయిం చిన వృత్తిపన్ను సంబంధిత పురపాలక సంఘాలకు కేటాయిస్తారు.
ఫ పన్నేతర ఆదాయం..
సేవలు అందించినందుకు లేదా అనుమతులు ఇచ్చినందుకు వసూలు చేసే రుసుమును పన్నేతర ఆదాయంగా పరిగణిస్తారు.
- నీటి తీరువా: తాగునీటి సరఫరాతో పాటు కుళాయి కనెక్షన్లకు ప్రజల నుంచి ఈ పన్ను వసూలు చేస్తారు.
- లైసెన్స్ ఫీజులు: దుకాణాల లైసెన్స్‌లు, హోటళ్లు, సినిమా థియోటర్ల అనుమతులకు యాజమానుల నుంచి ఫీజు వసూలు చేస్తారు.
- భవన నిర్మాణ అనుమతులు: కొత్తగా ఇళ్లు నిర్మించడం లేదా భవనాల ప్లాన్ల ఆమోదానికి పన్ను వసూలు చేస్తారు.
- మార్కెట్ అద్దె: పురపాలక సంఘం ఆధ్వ ర్యంలోని దుకాణ సముదాయాలు, సంతలు, మాంస పు దుకాణాల ద్వారా ఆదాయం అద్దెల రూపం లో అందుతుంది.
- జరిమానా: నిబంధనల ఉల్లంఘన, స్థలాల అక్ర మణలకు పాల్పడిన వారి నుంచి వసూలు చేస్తారు.
ఫ కేటాయించిన ఆదాయం..
రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల పన్నులను వసూలు చేసి అందులో కొంత బాగాన్ని పురపాలక సంఘాలకు కేటాయిస్తుంది.
- స్టాంప్‌డ్యూటీ: ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో వసూలు చేసే సర్‌చార్జీ పురపాలక సంఘాలకు అందుతుంది.
- వినోదపు పన్ను: సినిమా టికెట్లు, ఇతర వినోద కార్యక్రమాల ద్వారా సమకూరే పన్నులో పురపాలక సంఘాలకు వాటా ఉంటుంది.
ఫ ప్రభుత్వ గ్రాంట్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేప ట్టేందుకు పురపాలక సంఘాలకు నిధులు కేటాయి స్తారు.
- ఆర్థిక సంఘం నిధులు: కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు నేరుగా పురపాలక సంఘాలకు నిధులు విడుదల చేస్తుంది.
- ప్రభుత్వ పథకాలు: స్మార్ట్ సిటీమిషన్, అమృత్ భారత్ వంటి పథకాల ద్వారా నిధులు అందుతాయి.
- ప్రత్యేక గ్రాంట్లు: రహదారుల మరమ్మతులు, పారిశుధ్యం, అత్యవసర పనుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తుంది.