Home » YS Jagan
ఈ నెల 25న రాజమండ్రిలో జరగాల్సిన వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. వినాయక చవితి తర్వాత జగన్ పర్యటన ఉండొచ్చని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
అమరావతి: ఆడుదాం ఆంధ్రా అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. సోమవారం నాడు ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.
పులివెందులలో ఇప్పుడు ధర్మానికి, అధర్మానికి సమరం జరుగుతోందని కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత అన్నారు. రాష్ట్రమంతా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక వైపే చూస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో పులివెందుల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని స్పష్టం చేశారు.
ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఏపీలో ప్రవేశించవద్దని హైకోర్టు గతంలో షరతులు విధించింది. అయితే ఆ షరతులను సడలించాలని తాజాగా భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. పులివెందులలో తనకు వ్యవసాయం ఉందని, అనారోగ్యంతో ఉన్నానని ఏపీలో అడుగు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో వివరించారు.
మాజీ సీఎం జగన్ మాటలతో జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని వివేకా హత్య కేసు సాక్షి దస్తగిరి అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, తమ్ముడు అహ్మద్ బాషా అండతో.. రాయచోటిలోని జగన్ అనుచరులు భూకబ్జాలు చేశారని ఆరోపించారు
కృష్ణా డెల్టా తూర్పు కెనాల్ కింద ఉన్న గుడివాడ, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో సాగునీటి సమస్యలని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈస్టర్న్ కెనాల్ కు 10,400 క్యూసెక్కుల నీరు..
ఏపీలో వైఎస్ జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ గ్యాంగ్ అడ్డంగా బుక్కైంది. దీంతో చెవిరెడ్డి గ్యాంగ్ మొత్తం బాగోతం బట్టబయలైనట్లైంది. డబ్బుల డెన్ లో వెంకటేష్ నాయుడు వీడియోను అతని ఫోన్ నుంచి రిట్రీవ్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రజలు సైకో పాలన చూశారని, గత పాలకులు పెన్షన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టి, ఆర్థిక విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తల్లి, చెల్లికి అన్యాయం చేసిన వైఎస్ జగన్ అసలు నాయకుడిగా పనికొస్తాడా..? అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సొంత తల్లి, చెల్లి మీద కేసులు పెట్టిన జగన్ రాష్ట్ర మహిళలకు ఏ న్యాయం చేస్తారని ప్రశ్నించారు.