AP News: ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని చరిత్ర హీనుడు జగన్
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:45 PM
నలభై సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా దిగిపోయిన చరిత్ర హీనుడు జగన్మోహనరెడ్డి ఒక్కడేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.
- కనపర్తి శ్రీనివాసరావు
గుంటూరు: నలభై సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా దిగిపోయిన చరిత్ర హీనుడు జగన్మోహనరెడ్డి ఒక్కడేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు(Kanaparthi Srinivasa Rao) ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ కట్టానంటున్న వైద్య కళాశాలలు ఇటీవల కురిసిన వర్షాలకు జగనన్న చెరువులుగా మారిపోయాయని కనపర్తి ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ భవనాలకు వైసీపీ(YCP) రంగులు వేయటం, తీయటం, సర్వేరాళ్ళపై జగన్ బొమ్మలు చెక్కించుకోవడం లాంటి పిచ్చిపనులకు 4200 కోట్లు ఖర్చు పెట్టిన జగన్ రెడ్డి, ఆ నిధులను వైద్య కళాశాలలు నిర్మించటానికి వినియోగిేస్త సగం నిర్మాణాలు పూర్తయ్యేవని అన్నారు. ప్రజలివ్వని ప్రతిపక్షహోదా కోసం పదే పదే సభాపతిని యాచించటం, విమర్శించటం జగన్‌రెడ్డికే చెల్లిందని కనపర్తి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?
సిందూర్ తో మసూద్ కుటుంబం చిన్నాభిన్నం
Read Latest Telangana News and National News