Lokesh on CBN Arrest: నేటికి రెండేళ్లు.. తండ్రి అరెస్ట్‌పై లోకేశ్ భావోద్వేగం
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:11 PM
టీడీపీ అధినేత చంద్రబాబుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని అప్పటి వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి నేటికి రెండు సంవత్సరాలైంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు.
అమరావతి, సెప్టెంబర్ 9: ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి(AP CM), టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)ని అప్పటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి నేటికి రెండు సంవత్సరాలైంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్(Nara Lokesh) గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.
'రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున, నా తండ్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్టు చేశారు. ఈ ఘటన మా కుటుంబానికి మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికే ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. ఆ క్షణం అనుభవించిన బాధ అలాగే ఉంది. మా సంకల్పం కూడా అలాగే ఉంది. ఆయన ధైర్యం, గౌరవం, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఆయనకున్న అచంచలమైన విశ్వాసం.. న్యాయం, సత్యం కోసం మా పోరాటానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి' అని నారా లోకేష్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
క్యూలో నిలబడి ఓటు వేసిన ప్రియాంక గాంధీ
For More National News And Telugu News