Share News

Vice President Election 2025: క్యూలో నిలబడి ఓటు వేసిన ప్రియాంక గాంధీ

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:17 PM

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత జైరామ్ రమేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ వీల్‌చైర్‌పై పార్లమెంటుకు వచ్చి ఓటు వేశారు.

Vice President Election 2025: క్యూలో నిలబడి ఓటు వేసిన ప్రియాంక గాంధీ
Priyanka Gandhi

న్యూఢిల్లీ: నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ చురుకుగా సాగుతుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు పార్లమెంటు నూతన భవనంంలోని 'ఎఫ్-101 వసుధ'లో ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi_ తొలి ఓటు వేశారు. ఆ వెంటనే ఆయన వరద బాధత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌కు బయలుదేరారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభల ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) క్యూలో నిలబడి ఓటు వేయడం అందర్నీ ఆకట్టుకుంది.


కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi), లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేష్, శశిథరూర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ వీల్‌చైర్‌పై పార్లమెంటుకు వచ్చి ఓటు వేశారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, చిరాగ్ పాశ్వాన్, కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ తదితర ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.


కాగా, వివిధ కారణాల రీత్యా ఓటింగ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు భారత్ రాష్ట్ర సమితి (BRS), బిజూ జనతాదళ్ (BJD), శిరోమణి అకాలీదళ్ (SAD) ప్రకటించాయి. బీఆర్ఎస్‌కు నలుగురు రాజ్యసభ ఎంపీలు, బీజేడీకి ఏడుగురు రాజ్యసభ ఎంపీలు, శిరోమణి అకాలీదళ్‌కు ఒక ఎంపీ ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

ఉపరాష్ట్రపతి ఎన్నికకు గైర్హాజరైన పార్టీలివే

తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ

For More National News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 01:28 PM