YS Jagan: మండలిలో మనకు బలం ఉంది.. సమస్యలపై మాట్లాడండి.. వైసీపీ నేతలకు జగన్ సూచన
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:58 PM
శాసన మండలిలో వైసీపీకి మంచి బలం ఉందని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని వైసీపీ నేతలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది.
అమరావతి: శాసన మండలిలో వైసీపీకి మంచి బలం ఉందని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని వైసీపీ నేతలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదని, ఎవరూ గొంతు విప్పకూడదనేది వారి అభిప్రాయమని జగన్ విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై జగన్ వారికి మార్గనిర్దేశం చేశారు (YSRCP leader remarks).
కొంతమంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది సలహాలు ఇచ్చారని.. కానీ, తాము అలా చేయలేదని జగన్ అన్నారు. ఇటీవలి ప్రెస్‌మీట్లో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, మెడికల్ కాలేజీలు, యూరియా సహా రైతుల కష్టాల మీద మాట్లాడానని చెప్పారు. ఆ మూడింటి గురించి ఆధారాలతో సహా మాట్లాడటానికి గంటకుపైనే పట్టిందని, అసెంబ్లీలోనూ ఆ మాత్రం సమయం ఇస్తేనే నిశితంగా చెప్పగలుగుతామని అన్నారు (Andhra Pradesh politics).
అసెంబ్లీలో ఉన్నవి నాలుగు పార్టీలే అని, అందులో బీజేపీ, జనసేన, టీడీపీ అధికార పక్షంలో ఉన్నాయని పేర్కొన్నారు జగన్. ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు(Legislative Council meeting). శాసన మండలిలో వైసీపీకి మంచి బలం ఉందని, అక్కడ ప్రజల తరఫున గొంతు విప్పడానికి వైసీపీ నేతలకు అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అన్నది ఉందా? లేదా? అనే సందేహం ప్రజలకు కలుగుతోందని.. విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి కనీస అంశాలనూ పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు. లా అండ్ ఆర్డర్ కూడా దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
పెన్షన్‌లు తొలగించలేదు.. ప్రచారాలు మానండి.. వైసీపీపై మంత్రి ఫైర్
తొలిసారి మండలికి నాగబాబు.. పవన్ దిశానిర్దేశం]
Read Latest AP News And Telugu News