Share News

AndhraPradesh News: మాజీ సీఎం జగన్ ఫోటోతో ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ..

ABN , Publish Date - Sep 16 , 2025 | 09:31 PM

మాజీ సీఎం జగన్ ఫోటోతో ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్లు జారీ చేసిన ఘటన కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో బందరు మండలం తాళ్లపాలెం సచివాలయ ఉద్యోగుల బాధ్యతారాహిత్యం బయటపడింది. సదరు ఉద్యోగులు జారీ చేసిన సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

AndhraPradesh News: మాజీ సీఎం జగన్ ఫోటోతో ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ..
Andhra Pradesh news

మాజీ సీఎం జగన్ ఫోటోతో ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్లు జారీ చేసిన ఘటన కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో బందరు మండలం తాళ్లపాలెం సచివాలయ ఉద్యోగుల బాధ్యతారాహిత్యం బయటపడింది. సదరు ఉద్యోగులు జారీ చేసిన సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం మారిపోయినా ఇంకా జగన్ ఫోటోతో కూడిన సర్టిఫికేట్లు జారీ చేయడంపై తీవ్ర చర్చ జరుగుతోంది (Jagan photo certificates).


మంగళవారం ఒక్క రోజే సుమారు పది సర్టిఫికెట్లను మాజీ సీఎం జగన్‌ ఫొటోతో జారీ చేసినట్టు సమాచారం (caste income certificate controversy). ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సర్టిఫికెట్ల జారీపై విచారణ ప్రారంభించారు. ఎంపీడీఓ వెంకటేష్ సచివాలయం ఉద్యోగులను విచారిస్తున్నారు. ఈ ఒక్క రోజే ఈ తరహా సర్టిఫికెట్లను జారీ చేశారా..? గతంలోనూ ఇదే విధంగా జారీ చేశారా..? అనే దానిపై అధికారులు విచారిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రెవెన్యూలో టెక్నాలజీ సమగ్రంగా అమలు చేయండి: సీఎం చంద్రబాబు

జగన్ అసెంబ్లీకి రా.. తేల్చుకుందాం..మంత్రి ఆనం స్ట్రాంగ్ సవాల్

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 16 , 2025 | 09:32 PM