Home » YS Jagan Mohan Reddy
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతూ విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే ప్రతి గురువు దైవంతో సమానమని మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు.
ప్రధాని మోదీ ప్రజల మనిషి అని... జనం మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. గత ఏడాది ఏపీకి పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. జాతీయ రహదారుల కనెక్టివిటి, రైలు మార్గాల పెంపుతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతిలను కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతోందని పీవీఎన్ మాధవ్ తెలిపారు.
ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీలో నాలుగు స్లాబ్‌లను రెండుకు కుదించి నిత్యావసరాల ధరలు తగ్గించడం చారిత్రాత్మక సంస్కరణ అని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. సరళమైన వృద్ధి, ఆధారిత పన్ను విధానం ఒక నిర్ణయాత్మక అడుగును సూచిస్తోందని తెలిపారు. ఈ మైలురాయి సంస్కరణలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయినా తన ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేనట్లుగా తెలుస్తోంది. ఇటీవల సొంత నియోజకవర్గంలో ఆయన ప్రవర్తించిన తీరుపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.
మూడు తరాల నాయకులతో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పని చేశారని హోం మంత్రి అనిత గుర్తు చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడును అన్యాయంగా జైల్లో పెట్టి వేధించిందని తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఆదివారం ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి కోరారు.
రుషికొండ టూరిజం రిసార్ట్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం వాడుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ రిసార్టును మేజర్‌గా ఎలా వినియోగించాలో కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో, దేశంలో మైనారిటీల హక్కులు కాపాడేది తమ పార్టీ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉద్ఘాటించారు. ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ పార్టీని విశ్వశిస్తున్నారని.. వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలని షర్మిల సూచించారు.
తెలంగాణ హై కోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై ఉన్న కేసు క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలైంది.
అమరావతిపై జగన్ అండ్ కో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. 2014, 2019లో రూ. 9 వేల కోట్లు రాజధానికి ఖర్చు పెడితే అదంతా నాశనం అయ్యిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అమరావతిలో అనేక సమస్యల్ని పరిష్కరించిందని మంత్రి నారాయణ ఉద్ఘాటించారు.