Yarapathineni Slams Jagan: ఆ భూతం లేకపోవడంతో రెట్టింపు ఉత్సహంతో దీపావళి వేడుకలు..
ABN , Publish Date - Oct 21 , 2025 | 12:16 PM
రాక్షసుల్లా ప్రవర్తించే వైసీపీ... రాజకీయ పార్టీని కాకుండా, ఓ దొంగల ముఠాని నడుపుతోందని యరపతినేని విమర్శించారు. జగన్ కుట్రలను, వైసీపీని ప్రజలు 53 గ్రేడ్ సిమెంట్‌తో పాతరేసి మళ్లీ పైకి లేవకుండా చేశారంటూ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి, అక్టోబర్ 21: రాష్ట్రాన్ని ఐదేళ్లు పట్టి పీడించిన భూతం లేనందుకు నిన్న రాష్ట్ర ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో దీపావళి జరుపుకున్నారని గురజాల ఎమ్మెల్యే, తెలుగుదేశం సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు (Yarapathineni Srinivasa Rao)అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మారీష కుట్రలు ఎన్ని పన్నినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇక ఆగదనే నమ్మకం నిన్న ప్రజల్లో కనిపించిందన్నారు. తమ పార్టీకి, తమకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదనే ఆందోళన వైసీపీ నేతల మాటల్లో కనిపిస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు అడ్డంగా నరికారు కాబట్టే 151నుంచి 11కు వచ్చారని గ్రహించాలని హితవుపలికారు. ఇంకా రఫా రపా అంటూ విర్రవీగితే వచ్చేసారి ఆ 11 కూడా మిగలవని హెచ్చరించారు. రాక్షసుల్లా ప్రవర్తించే వైసీపీ... రాజకీయ పార్టీని కాకుండా, ఓ దొంగల ముఠాని నడుపుతోందని విమర్శించారు. జగన్ కుట్రలను, వైసీపీని ప్రజలు 53 గ్రేడ్ సిమెంట్‌తో పాతరేసి మళ్లీ పైకి లేవకుండా చేశారంటూ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ, జగన్ డీఎన్ఏలోనే విధ్వంసం అనే విషం ఉందన్నారు. ఏ శాస్త్రవేత్త, వైద్యుడు కూడా మందు కనిపెట్టని ఈ విషం వైద్యానికో, ఆపరేషన్‌లతోనో నయమయ్యేది కాదని.. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజలే వైద్యులు, శాస్త్రవేత్తలుగా మారి వైసీపీ అనే విషం మళ్లీ రాష్ట్రానికి రాకుండా చూడాలని కోరారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల వైసీపీ నేతల బిడ్డలు కూడా బాగుపడతారని తెలిసి కూడా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల మద్యం కుంభకోణం అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే లేని నకిలీ మద్యాన్ని సృష్టించేందుకు కుట్రపన్నారని ఫైర్ అయ్యారు. అధికారం కోసం, ధనదాహం కోసం తల్లి, చెల్లీతో పాటు ఎవరి మధ్య అయినా చిచ్చు పెట్టేందుకు జగన్ వెనుకాడరని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌పైనా, అమరావతి పైనా విషం చిమ్మటం ఇకనైనా మానుకోకుంటే వైసీపీకి మళ్లీ చావుదెబ్బ తప్పదని యరపతినేని శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. మూడు దేశాల్లో..
పోలీసుల పని తీరును తప్పక కొనియాడాల్సిందే: విశాఖ సీపీ
Read Latest AP News And Telugu News