Police Martyrs Day: పోలీసుల పని తీరును తప్పక కొనియాడాల్సిందే: విశాఖ సీపీ
ABN , Publish Date - Oct 21 , 2025 | 09:23 AM
1929వ సంవత్సరం నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటూ వస్తున్నామని విశాఖ సీపీ అన్నారు. సమాజం సురక్షితంగా ఉంది అంటే పోలీసుల కృషి కారణమన్నారు.
విశాఖపట్నం, అక్టోబర్ 21: నగరంలోని బీచ్‌రోడ్డులో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ (AP TDP Chief Palla Srinivas), జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి (CP Shankhabrata Bagchi), ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీస్ అమరవీరులకు జిల్లా కలెక్టర్, సీపీ, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. 1929వ సంవత్సరం నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటూ వస్తున్నామని గుర్తుచేశారు. సమాజం సురక్షితంగా ఉంది అంటే పోలీసుల కృషి కారణమన్నారు.
విపత్తు నిర్వహణ, ఎన్నికల విధి నిర్వహణతో పలు సందర్భాలలో పోలీసులు విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో పోలీసుల పని తీరును తప్పక కొనియాడాలన్నారు. పోలీసులు లేని సమాజాన్ని మనం ఊహించలేమని చెప్పుకొచ్చారు. 2025వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేశారని తెలిపారు. పోలీసుల మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం విశాఖ పోలీసులకు ప్రతి ఏటా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని సీపీ శంఖబ్రత బాగ్చిపేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వైజాగ్కి గూగుల్ పెట్టుబడి రావడానికి కారణం శాంతి భద్రతలు: సీఎం చంద్రబాబు-
విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. మూడు దేశాల్లో..
Read Latest AP News And Telugu News