Share News

Heavy Rains in AP: ఉపరితల ఆవర్తనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ABN , Publish Date - Oct 21 , 2025 | 07:01 AM

నైరుతి రుతుపవనాలు వెళ్లినప్పటికీ దేశంలోని పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య రుతుపవనాల రాకతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వానలు కురుస్తున్నాయి.

Heavy Rains in AP: ఉపరితల ఆవర్తనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Heavy Rains in AP

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 21: నైరుతి రుతుపవనాలు వెళ్లినప్పటికీ దేశంలోని పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య రుతుపవనాల రాకతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వానలు కురుస్తున్నాయి. ఈ నెల 17వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి మరింత తీవ్రరూపం దాల్చిందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. గురువారం నాటికి దక్షిణమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా మారడానికి వాతావరణం అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఈ తరుణంలోనే ఇవాళ బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశము ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతోపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.


తీవ్ర వాయుగుండం ఏర్పడిన సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని వివరించారు. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకూడదని, ఇప్పటికే సముద్రం మీదికి వెళ్లిన వాళ్లు తిరిగి రావాలని కీలక సూచనలు చేశారు. తీర ప్రాంతాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, ఇళ్లు కింద ఉండకూడదని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

CM Chandrababu Foreign Tour: విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. మూడు దేశాల్లో..

AP E-Auto: పక్కన పెట్టిన గత వైసీపీ సర్కారు.. శిథిలావస్థలో ఈ-ఆటో

Updated Date - Oct 21 , 2025 | 08:26 AM