Satya Kumar Hits Out Jagan: అప్పుడేం చేశారు గాడిదలు కాశారా?.. వైసీపీపై మంత్రి ఫైర్
ABN , Publish Date - Oct 22 , 2025 | 01:59 PM
జగన్ బెదిరింపులకు ఎవరూ తగ్గేది లేదన్నారు మంత్రి సత్యకుమార్. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని.. వైసీపీ వచ్చేది లేది.. చచ్చేది లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ, అక్టోబర్ 22: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (CM YS Jagan Mohan Reddy) మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) ఫైర్ అయ్యారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల నిర్మాణం పీపీపీ మోడల్‌లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్‌ల నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు. రూ.5వేల కోట్ల పనులకు రూ.500 కోట్ల పనులే చేశారన్నారు. పులివెందులలో మాత్రమే జగన్.. మెడికల్ కళాశాలను పూర్తి చేశారని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో 10 మెడికల్ కళాశాలలు పీపీపీ విధానంలో పూర్తి చేస్తామని ప్రకటించారు.
జగన్ బెదిరింపులకు ఎవరూ తగ్గేది లేదన్నారు మంత్రి సత్యకుమార్. జగన్ తిరిగి అధికారంలోకి రావడం కల్ల అని ఎద్దేవా చేశారు. వైసీపీ వచ్చేది లేదు.. చచ్చేది లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పది మెడికల్ కళాశాలు పూర్తి అయితే 70 శాతం పేద విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. యాజమాన్య హక్కులు, నిర్వహణ మొత్తం ప్రభుత్వం చేతిలోనే ఉంటాయని వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్లే నేడు పీపీపీ విధానంలో తాము నిర్మిస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్మాణం చేయకుండా గాడిదలు కాశారా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
ఉద్దానం విషయంలోనూ రాద్దాంతం చేస్తున్నారని.. ఇలా చేస్తే 11 సీట్లు కూడా ఈసారి రావన్నారు. ప్రజలు చిత్తుగా ఓడించారని జగన్ కక్ష కట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరగకుండా అడ్టు పడుతున్నారన్నారు. అన్ని విషయాలు ప్రజలు గమనిస్తున్నారని.. వాళ్లకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్టీఆర్ వైద్య సేవలపై చర్చిస్తున్నామని.. అన్నీ సర్దుకుంటాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
12 గంటల్లోపు వాయుగుండం.. హోంమంత్రి కీలక ఆదేశాలు
వారి సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు: మాధవ్
Read Latest AP News And Telugu News