Home » Weather
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం(ఆగస్టు 16) కూడా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద ఉదృతితో మూసారంబాగ్ బ్రిడ్జ్ దెబ్బతింది. అధికారులు ఆ బ్రిడ్జిని రిపేర్ చేసే పనిలో పడ్డారు. దీంతో అక్కడ రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తోండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ఆరోగ్యశాఖకు మంత్రి దామోదర రాజనర్సింహ కీలక సూచనలు చేశారు. వర్షాల్లో వైద్య సేవలు నిరవధికంగా కొనసాగించాలని ఆదేశించారు. గర్భిణుల కోసం అత్యవసర చికిత్సకూ సిద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సచివాలయంలో రెవెన్యూశాఖ అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు కాలనీల్లో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ ప్రకారం.. బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 3.1 - 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
Hyderabad Weather Updates: హైదరాబాద్ నగరంలో మరికాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక అడ్వైజరీ జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉందని వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. వరద నీరు పొటెత్తుతుండటంతో పలు ప్రాజెక్ట్‌ల గేట్లు తెరిచారు. హిమాయత్ సాగర్, శ్రీరాంసాగర్, మూసీ ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం జలాశయాల్లో భారీగా వరద ప్రవహిస్తోంది.
దేశవ్యాప్తంగా మళ్లీ వర్షాల వెదర్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) అప్రమత్తమై పలు రాష్ట్రాల్లో వానలు ముప్పును గుర్తించి రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.