Home » Weather
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వచ్చే మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వ్యాఖ్యానించారు. రానున్న 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో ఈ వానాకాలంలో వర్షాలు తగ్గే అవకాశం ఉండడంతో రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గడంతో వాతావరణం చల్లబడింది.
ఈ సారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళంలోకి ప్రవేశించాయి. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
దేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాల సీజన్‌పై ఈసారి ‘ఎల్‌నినో’ పిడుగు పడనుంది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు గల నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవనున్నాయి.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది దేశంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండనుందని.. దీనివల్ల నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడి వర్షాలు కురిశాయి.
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ వర్షాలపై కీలక ప్రకటన చేసింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.