Hyderabad Rain Alert: త్వరగా ఇంటికి చేరుకోండి.. ఎందుకంటే..
ABN , Publish Date - Aug 12 , 2025 | 02:59 PM
Hyderabad Weather Updates: హైదరాబాద్ నగరంలో మరికాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక అడ్వైజరీ జారీ చేశారు.
Hyderabad Weather Updates: హైదరాబాద్ నగరంలో మరికాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. ‘హైదరాబాద్ నగర వ్యాప్తంగా మంగళవారం (12/08/2025) భారీ వర్ష సూచన ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలి. మధ్యాహ్నం 3 గంటల్లోగా ఇళ్లకు చేరుకునేలా చూసుకోండి. సాయంత్రం షిఫ్ట్ ఉన్నవారు ఇంటి నుంచే పని చేసేలా ప్లాన్ చేసుకోగలరు.’ అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు.