Home » Visakhapatnam
రుషికొండ టూరిజం రిసార్ట్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం వాడుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ రిసార్టును మేజర్‌గా ఎలా వినియోగించాలో కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
విశాఖపట్నంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అగ్నిప్రమాదానికి గురైన సమాచారాన్ని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుసుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంత్రి మండిపల్లి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ శ్రీ భరత్ పేర్కొన్నారు.
తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ సమావేశాల్లో చర్చిస్తారు. 29వ తేదీన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న 10 మందిని ఎంపిక చేసి.. వారితో వివిధ అంశాలపై అధినేత మాట్లాడతారు.
ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరిని విధుల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ కలలు సాకారమయ్యాయని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రతలో ఈ రెండు యుద్ధ నౌకలు చరిత్ర సృష్టిస్తాయనే నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేశారు.
వినాయకచవితి సందర్భంగా విశాఖ వాసులు పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడనికి సిద్ధమయ్యారు. వీధి వీధిలో వినాయక విగ్రాహాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విగ్రహాల తయారీలో కొంతమేర ఆటంకం ఏర్పడింది.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఏపీ వ్యాప్తంగా ఈరోజు చేపట్టామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో రేషన్ కార్డుపై ఆ నాయకుడు బొమ్మలు వేసుకున్నారని ధ్వజమెత్తారు.
విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. దీంతో భయాందోళనలు నెలకొన్నాయి.
Major Wedding Theft Case: భారీ దొంగతనం కేసును గాజువాక క్రైమ్ పోలీసులు ఛేదించారు. షీలా నగర్ పెళ్లి ఇంటిలో దొంగతనం చేసిన ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. నిందుతులు నాగేశ్వరరావు, అర్జున్ జ్ఞాన్ ప్రకాష్, రాంబాబులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
విశాఖపట్నంలో కాల్పులు కలకలం రేపాయి. పాత కక్షల కారణంగా నాటు తుపాకీతో కాల్చడంతో రాజేష్ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. కాల్పుల జరిపిన వ్యక్తి సస్పెన్షన్‌లో ఉన్న కానిస్టేబుల్‌గా పోలీసులు గుర్తించారు.