Visakhapatnam Earthquake: ఏపీలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు..
ABN , Publish Date - Nov 04 , 2025 | 08:21 AM
విశాఖలోని ఆరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్‌బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలిలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
విశాఖపట్నం: ఇవాళ(మంగళవారం) తెల్లవారుజామున 4:19 గంటల సమయంలో భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూమి కంపించగానే ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. విశాఖతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా జిమాడుగులలో కూడా భూమి కంపించింది. 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెక్టర్ స్కేల్‌పై 3.7గా తీవ్రత నమోదు అయినట్లు వెల్లడించారు.
విశాఖలోని ఆరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్‌బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలిలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అలాగే.. సింహాచలంలోనూ స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇవి కూడా చదవండి:
Electricity Department: అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు
AP Assembly House Committee: వైసీపీ హయాంలో అవినీతిపై 17లోగా నివేదిక