CM Chandrababu UAE Tour: ప్రతిష్టాత్మకంగా పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్.. యూఏఈలో పర్యటించనున్న ముఖ్యమంత్రి
ABN , Publish Date - Oct 21 , 2025 | 05:51 PM
రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ముఖ్యమంత్రి బృందం రేపటి నుంచి 3 రోజుల పాటు యూఏఈలో పర్యటించనుంది. విశాఖలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు వివిధ సంస్థల ప్రతినిధులను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
అమరావతి: రేపటి నుంచి 3 రోజుల పాటు యూఏఈ (UAE)లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం యూఏఈలో ముఖ్యమంత్రి బృందం పర్యటన చేపట్టనుంది. వచ్చే నెల 14-15వ తేదీల్లో విశాఖలో జరగనున్న పార్టనర్షిప్ సమ్మిట్‌కు వివిధ సంస్థల ప్రతినిధులను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. మూడు రోజుల పర్యటన కోసం రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి సీఎం చంద్రబాబు దుబాయ్ వెళ్లనున్నారు.
వన్ టు వన్ మీటింగ్
3 రోజుల్లో వివిధ అంతర్జాతీయ సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో వన్ టు వన్ మీటింగులకు ముఖ్యమంత్రి హజరు కానున్నారు. పారిశ్రామికవేత్తలతో పాటు యూఏఈకి చెందిన ప్రభుత్వ ప్రతినిధులతోనూ భేటీ కానున్నారు. రేపు దుబాయ్‌లో సిఐఐ రోడ్ షో కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనున్నారు. దుబాయ్‌లో మూడవ రోజు AP NRT ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొనున్నారు.
తొలి రోజు పర్యటనలో..
తొలి రోజు పర్యటనలో భాగంగా 22వ తేదీ ఐదు కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో రేపు సీఎం చంద్రబాబు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీయల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ సదుపాయాలు, పోర్టులు-షిప్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులపై ఆయా సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు చర్చించనున్నారు. అంతేకాకుండా, పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పలు ప్రాంతాలను సందర్శించనుంది.
ప్రతిష్టాత్మకంగా విశాఖ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్
చంద్రబాబుతో పాటు దుబాయ్ పర్యటనలో మంత్రులు టిజి భరత్, బిసి జనార్థన్ రెడ్డి, సీఎం సెక్రటరీ కార్తికేయ మిశ్రా, ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్, ఏపీ ఇడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రి రెడ్డి పాల్గొననున్నారు. నవంబర్‌లో నిర్వహించే విశాఖ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునేందుకు ఇప్పటికే సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ రోడ్ షోలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
పోలీసుల పని తీరును తప్పక కొనియాడాల్సిందే: విశాఖ సీపీ
Yarapathineni Slams Jagan: ఆ భూతం లేకపోవడంతో రెట్టింపు ఉత్సహంతో దీపావళి వేడుకలు..
Read Latest AP News And Telugu News