P.V.N. Madhav on YS Jagan: జగన్‌కి ఎందుకంత కుళ్లు? ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సూటి ప్రశ్న
ABN , Publish Date - Oct 21 , 2025 | 04:03 PM
గూగుల్ ఎఐ హబ్ విశాఖకు రావడం గొప్ప పరిణామం అని చెప్పిన మాధవ్.. ప్రతిపక్షాలు ప్రగతిని ఓర్వలేక మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, వైఎస్ జగన్ దిగజారుడు వ్యాఖ్యలు..
విశాఖపట్నం, అక్టోబర్ 21: గూగుల్ ఎఐ డేటా సెంటర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి వి ఎన్ మాధవ్ ఇవాళ విశాఖపట్నంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాధవ్ పలు కామెంట్స్ చేశారు. ప్రపంచం మొత్తం మాట్లాడుకునే ప్రత్యేక ప్రదేశంగా విశాఖ మారిందన్న మాధవ్.. విశాఖ గ్లోబల్ కేపిటల్‌గా మారబోతుందని చెప్పారు.
గూగుల్ ఎఐ హబ్ విశాఖకు రావడం గొప్ప పరిణామమని చెప్పిన మాధవ్.. ప్రతిపక్షాలు ప్రగతిని ఓర్వలేక మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మాధవ్ విమర్శించారు.
ప్రియాంక్ ఖర్గే.. స్కెవింజింగ్, పెరసైట్ పదాలు ఉపయోగించడం దారుణమని మాధవ్ అన్నారు. వైసీపీ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతించడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డికి విశాఖకు గూగుల్ పెట్టుబడులు రావడం ఇష్టంలేదనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
'గూగుల్‌ను స్వాగతిస్తూ జగన్ కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. గూగుల్ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తుంటే వైసీపీ ఎందుకు స్వాగతించడం లేదో సమాధానం చెప్పాలి. ప్రపంచంలో దిగ్గజ సంస్థలకు 40 శాతం సర్వీస్ ప్రొవైడర్లుగా తెలుగువారు ఉన్నారు. విశాఖ కేంద్రంగా యువతకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడులు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. సెమి కండక్టర్స్ కు ఏపి కేపిటల్ గా మారబోతుంది. గూగుల్.. అమెరికా వెలుపల పెద్ద మొత్తంలో విశాఖలోనే పెట్టుబడులు పెడుతోంది. విశాఖలో 1.3 లక్షల కోట్లతో గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. విశాఖలో నూతన శకం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే సీపీ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ లాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసుకున్నాము.' అని మాధవ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్..
పోలీసుల పని తీరును తప్పక కొనియాడాల్సిందే: విశాఖ సీపీ