Share News

Pawan Serious On Bheemavaram DSP: భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్..

ABN , Publish Date - Oct 21 , 2025 | 02:32 PM

డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఫిర్యాదుల విషయాన్ని ప్రస్తావించి అతడి వ్యవహారశైలిపై నివేదిక పంపించాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు.

Pawan Serious On Bheemavaram DSP: భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్..
Pawan Serious On Bheemavaram DSP

అమరావతి, అక్టోబర్ 21: భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalya) చర్చించారు. డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్‌కు తరచూ ఫిర్యాదులు వెళ్లాయి. పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకొంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నట్లు పవన్‌కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశంపై వెంటనే చర్యలు ఉపక్రమించారు పవన్. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో దీనిపై ఫోన్‌లో చర్చించారు. డీఎస్పీకి సంబంధించిన వ్యవహారంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఫిర్యాదుల విషయాన్ని ప్రస్తావించి అతడి వ్యవహారశైలిపై నివేదిక పంపించాలని ఎస్పీకి పవన్ ఆదేశాలు జారీ చేశారు.


అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలని ఎస్పీకి ఉపముఖ్యమంత్రి సూచించారు. ఇలాంటి వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలని తెలిపారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతి భద్రతలను పరిరక్షించాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి..

పోలీసుల పని తీరును తప్పక కొనియాడాల్సిందే: విశాఖ సీపీ

Yarapathineni Slams Jagan: ఆ భూతం లేకపోవడంతో రెట్టింపు ఉత్సహంతో దీపావళి వేడుకలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 21 , 2025 | 02:33 PM