Home » Vijayawada
విజయవాడలోని ఆటోనగర్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 7 బస్సులు కాలిపోయాయి. మరమ్మతుల కోసం ఉంచిన బస్సులో మంటలు చెలరేగటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలను అమలు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులు, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తోందని తెలిపారు.
సానుకూల వాతావరణం ఉన్నప్పుడు లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. కులమత విద్వేషాలు పెంచేలా చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని.. ఎస్సీలను పావులుగా వాడుకుని రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు.
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన మెమోలో కోర్టుకు సిట్ ముఖ్య విషయాలు తెలియజేసింది.
సీఐ నాగరాజు పోలీస్ కస్టడీపై న్యాయస్థానం గురువారం తుది తీర్పును వెలువరించింది. సిట్ అధికారులు 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో మరో ఇద్దరు పోలీసులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కేసులో నిందితులుగా ఉన్న కానిస్టేబుళ్లు బాబురావు, సాంబయ్యలను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు.
కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీటిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విడుదల చేశారు. ఎగువన వర్షాలు లేకపోవడంతో ఇరిగేషన్ అధికారులు పులిచింతల ప్రాజెక్టులోని నీటిని డెల్టా అవసరాలకు వాడుతున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికీ పెన్షన్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ప్రజలకు స్వయంగా పెన్షన్లను అందజేశారు.
విజయవాడలోని బీబీగూడెం వద్ద ఉన్న పశ్చిమ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును కంటైనర్ వెనక నుంచి ఢీకొట్టడంతో.. ముందున్న ట్యాంకర్‌ను కారు బలంగా ఢీకొట్టింది.