Share News

Marathon Run: విజయవాడ మారథాన్ రన్‌లో హీరో శర్వానంద్ జోష్

ABN , Publish Date - Oct 02 , 2025 | 08:55 AM

గాంధీ జయంతి పురస్కరించుకుని స్వచ్ఛ దివస్ దేశవ్యాప్తంగా జరుగుతోంది. 'స్వచ్ఛతా హి సేవ' పేరిట పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయవాడ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మారథాన్ రన్‌ నిర్వహించారు. హీరో శర్వానంద్..

Marathon Run: విజయవాడ మారథాన్ రన్‌లో హీరో శర్వానంద్ జోష్
Gandhi Jayanti Marathon Vijayawada

విజయవాడ, అక్టోబర్ 2: గాంధీ జయంతి పురస్కరించుకుని స్వచ్ఛ దివస్ (స్వచ్ఛ భారత్ దివస్) దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈ సందర్భంగా 'స్వచ్ఛతా హి సేవ' పేరిట పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయవాడలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో 'స్వచ్చదాన్' పేరిట విజయవాడలో మారథాన్ రన్‌ను నిర్వహించారు.

21కే, 10కే, 5కే మీటర్ల మూడు విభాగాల్లో జరిగిన ఈ రన్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 10 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు.


ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ మారథాన్, స్వచ్ఛతా సందేశాన్ని ప్రజలలోకి ప్రచారం చేసే లక్ష్యంతో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ తెలుగు హీరో శర్వానంద్ హాజరయ్యారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ ఆదర్శాలను గుర్తు చేసుకుంటూ, స్వచ్ఛతా అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ ఈవెంట్ నిర్వహించారు.

స్వచ్ఛతా హి సేవ క్యాంపెయిన్ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగింది. ఇందులో భాగంగానే, మారథాన్ రన్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు స్వయంగా పాల్గొన్నేలా చేయడానికి దోహదపడ్డాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంకు థ్యాంక్స్ చెప్పిన సీఎం

నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..

For More AP News And Telugu News

Updated Date - Oct 02 , 2025 | 09:41 AM