PVN Madhav On Vision 2047: దేశం అన్ని విధాలా ఎదగాలనే స్వదేశీ నినాదం..
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:49 AM
స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా ఇదే స్వదేశీ ఉద్యమంలో మహనీయులు పాల్గొన్నారని మాధవ్ గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఇతరుల ఆదేశాల మేరకు మన దేశంలో నిర్ణయాలు జరిగాయన్నారు.
విజయవాడ, అక్టోబర్ 1: బీజేపీ ప్రభుత్వంలో భారత దేశ ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ (AP BJP Chief PVN Madhav) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. స్వజాతి, స్వదేశీపై గౌరవ భావం కలిగేలా మోదీ (PM Modi) పాలన, నిర్ణయాలు ఉన్నాయని తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ఆత్మ నిర్బర్ భారత్ అమలు చేస్తుందని చెప్పారు. ‘అమెరికా.. మన దేశం మీద సుంకాల యుద్ధం, ఆంక్షలు ప్రకటించింది. మన దేశం అన్ని విధాలా ఎదగాలని మోదీ స్వదేశీ నినాదాన్ని తీసుకున్నారు’ అని మాధవ్ తెలిపారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా ఇదే స్వదేశీ ఉద్యమంలో మహనీయులు పాల్గొన్నారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఇతరుల ఆదేశాల మేరకు మన దేశంలో నిర్ణయాలు జరిగాయన్నారు. విదేశీ ఆలోచనలతో, విదేశీ కంపెనీలు ప్రోత్సహించారని... ఖాధీని పక్కన పెట్టడం వల్ల భారతదేశం బలహీన పడిందన్నారు. ప్రతి విషయంలో విదేశాలపై ఆధార పడే పరిస్థితికి తెచ్చారని విమర్శించారు. ఏ చిన్న పరికరం కావాలన్నా కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విధంగా చేశారన్నారు.
కార్గిల్ యుద్ధం సమయంలో శవ పేటికలను కూడా విదేశాల నుంచి తెచ్చారని.. అప్పుడు వాజ్ పాయ్ వంటి వారు మన దేశంలోనే తయారు చేయాలని ఆదేశించారని.. ఆ తరువాత మోదీ పాలనలోనే భారత దేశం అన్ని విధాలా వృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. 2014 నుంచి మోదీ స్వాలంబన అడుగులు బలంగా వేశారన్నారు. అంతర్జాతీయ యోగా డేను జూన్ 21న ప్రపంచం మొత్తం జరిపేలా మోదీ చేశారని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా అభివృద్ధికి బాటలు వేశారన్నారు. కుటీర పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ లు కూడా ఇచ్చారని.. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ మనమే తయారు చేసి అనేక దేశాలకు ఎగుమతి చేశామని తెలిపారు. ఇతర దేశాలకు కూడా ఇచ్చి కోట్లాది ప్రజల ప్రాణాలను కాపాడామని బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.
షర్మిలపై ఫైర్...
అలాగే షర్మిలపై మాధవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. షర్మిలకు ఆర్‌ఎస్‌ఎస్ అర్థమే తెలియదని వ్యాఖ్యలు చేశారు. మత విద్వేషాలు రెచ్చ గొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆమె, భర్తతో కలిసి స్వయంగా మత మార్పిడిలు చేశారని.. అటువంటి ఆమెను ఏపీసీసీ అధ్యక్షురాలిగా చేశారంటూ దుయ్యబట్టారు. ఆలయాలు వద్దు మరగు దొడ్లు కట్టండి అని చెబుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లీంలు, క్రైస్తవులకు కూడా ఇలాగే చెప్పే సాహసం చేయగలరా అని ప్రశ్నించారు. హిందువులు సౌమ్యులు.. ఏదైనా అనొచ్చు అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మత రాజకీయాలు చేసేది వారే... నిందలు బీజేపీపై వేస్తారా అంటూ మండిపడ్డారు. బలవంతంగా చేసే మత మార్పిడిలను తప్పకుండా అడ్డుకుంటామని మాధవ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
కాస్త నిలకడగా కృష్ణానది.. అయినప్పటికీ
ఏపీలో సుస్థిర పట్టణాభివృద్ధికి సిటీ నెట్ సహకారం
Read Latest AP News And Telugu News