Home » Venezuela
మదురోను ట్రంప్ పట్టుకుని స్వదేశానికి తీసుకువెళ్లినప్పుడు 170 మంది ప్రాణాలను బలికొన్న 2008 ఉగ్రదాడుల నిందితులైన మసూద్ అజహర్, లష్కరే తొయిబా నేతలను కూడా మోదీ పట్టుకురావచ్చు కదా అని ఒవైసీ అన్నారు.
వెనెజువెలా వ్యవహారాలు అమెరికా చేతుల్లోకి వెళ్లాక భారత్‌కు మేలు కలిగే అవకాశం ఉందని పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా చమురు ఎగుమతులపై ఆంక్షలు తొలగిపోతే ఓఎన్‌జీసీ బాకీ వసూలు కావడంతో పాటు అక్కడి ఆయిల్ ఫీల్డ్స్‌లో చమురు వెలికితీత పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు.
మదురో 12 ఏళ్ల పాలనకు తెరదించుతూ వెనుజువెలాపై అమెరికా ఆపరేషన్ జరిపింది. మదురో సమాచారం చెప్పన వారికి 50 మిలియన్ డాలర్లను బహుమతిని కూడా గతంలో ప్రకటించింది. దాడుల అనంతరం మదురో చేతులకు బేడీలు వేసి, కళ్లకు గంతలు తగిలించి కరేబియన్‌లో అమెరికా నేవీ షిప్‌ను ఎక్కిస్తున్న ఫోటోను ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం అమెరికా కస్టడీలో ఉన్న వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురో కొన్ని నెలల క్రితం చేసిన సవాలు తాలూకు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోను స్వయంగా శ్వేత సౌధం షేర్ చేసింది.
అమెరికా బలగాలు వెనెజువెలాపై శనివారంనాడు దాడులతో విరుచుకుపడింది. ఆ దేశం అధ్యక్షుడు నికోలాస్ మదురో, ఆయన భార్యను యూఎస్ డెల్టా ఫోర్స్ అదుపులోనికి తీసుకుని న్యూయార్క్ తరలించింది. అక్కడి కోర్టులో వీరు విచారణను ఎదుర్కోనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ నియమితులయ్యారు. అమెరికా దాడుల నేపథ్యంలో సంక్షోభ పరిస్థితుల నడుమ ప్రభుత్వ పాలనా కొనసాగింపు, దేశ రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి సుప్రీం న్యాయస్థానం స్పష్టం చేసింది.
వెనెజువెలా దేశంపై అమెరికా వైమానిక దాడులు చేయడంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ దాడులను మెజారిటీ దేశాలు ఖండించగా.. అర్జెంటీనా మాత్రం ప్రశంసించింది. ఇక.. స్పెయిన్ ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తామని పేర్కొంది.
వెనుజువెలా దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన సతీమణి సిలియాను నిర్బంధంలోకి తీసుకుంది. యుద్ధ నౌక ఐవో జిమాలో మదురోను, ఆయన భార్యను న్యూయార్క్‌కు తరలించింది. కొద్ది సేపటి క్రితమే మదురో న్యూయార్క్‌కు చేరుకున్నారు
వెనెజువెలా రాజధాని కరాకస్‌లో శనివారం తెల్లవారుజామున ఏడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ట్రంప్ ఆదేశాలతోనే ఈ దాడులు జరుగుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి.
ఓ వ్యక్తి డబ్బులతో నిండిన ట్రక్కులో నిలబడ్డాడు. రెండు చేతులతో పెద్ద మొత్తంలో డబ్బు ఎత్తి కిందపడేశాడు. అక్కడ ఉన్న వారు మాత్రం ఆ డబ్బును పెద్దగా పట్టించుకోలేదు.