Share News

US-Venezuela War: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను పట్టుకున్నాం: ట్రంప్

ABN , Publish Date - Jan 03 , 2026 | 03:33 PM

వెనెజువెలా రాజధాని కరాకస్‌లో శనివారం తెల్లవారుజామున ఏడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ట్రంప్ ఆదేశాలతోనే ఈ దాడులు జరుగుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి.

US-Venezuela War: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను పట్టుకున్నాం: ట్రంప్
Trumph with Nicolas maduro

వాషింగ్టన్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరుతో వెనెజువెలాపై తీవ్ర దాడులతో అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడుతోంది. ఈ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. దాడుల్లో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను నిర్బంధించినట్టు ప్రకటించారు. వెనెజువెలా నుంచి వేరే ప్రాంతానికి వారిని తరలిస్తున్నట్టు తెలుస్తోంది.


trumph-and-Nicolas-Maduro.jpg

వెనెజువెలా రాజధాని కరాకస్‌లో శనివారం తెల్లవారుజామున ఏడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ట్రంప్ ఆదేశాలతోనే ఈ దాడులు జరుగుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి. వెనెజువెలా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని, అధ్యక్షుడు మదురోకు కూడా ఈ ముఠాలతో సంబంధం ఉందని ఆమెరికా ఆరోపిస్తోంది.

కాగా, రాజధాని కారాకస్‌తో పాటు మిరాండా, అరగువా, లా గైరా రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా మిలటరీ దాడులు జరిపినట్టు వెనెజువెలా ప్రభుత్వాధికారులు తెలిపారు. దేశంలో అత్యయుక పరిస్థితిని ప్రభుత్వం ప్రకటించారు. విదేశీ మిలటరీ జోక్యాన్ని వెనెజువెలా రక్షణ మంత్రి వ్లాడిమిర్ పిడ్నినో ఖండించారు. పౌరులు, సైనిక స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని, ఈ చర్య చట్టవిరుద్ధమైన దురాక్రమణగా ఆయన పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

ట్రంప్ హెచ్చరిక వేళ.. వెనెజువెలాలో భారీ పేలుళ్లు..వీడియో వైరల్

Mexico Earthquake: మెక్సికోలో భూ ప్రకంపనలు.. ఇద్దరు మృతి

Updated Date - Jan 03 , 2026 | 03:59 PM