Share News

Venezuela: ట్రంప్ హెచ్చరిక వేళ.. వెనెజువెలాలో భారీ పేలుళ్లు..వీడియో వైరల్

ABN , Publish Date - Jan 03 , 2026 | 02:47 PM

దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో శనివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఇటీవల అమెరికా, వెనుజువెలా దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న వేళ.. ఈ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.

Venezuela: ట్రంప్ హెచ్చరిక వేళ.. వెనెజువెలాలో భారీ పేలుళ్లు..వీడియో వైరల్
Venezuela Explosions

ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలా (Venezuela) రాజధాని కారకాస్ (Caracas)‌తో పాటు సమీపంలోని మిరాండా (Miranda), అరాగువా (Aragua), లా గైరా (La Guaira) రాష్ట్రాలలో ఈ రోజు (శనివారం) దాదాపు ఏడు చోట్ల భారీ పెలుళ్లు (Bomb blast) సంభవించాయి. యుద్ద విమానాలు చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించి దాడులకు పాల్పపడటంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెనుజువేలాలో నిర్వహిస్తున్న మాదక ద్రవ్యాల(Drugs) అక్రమ రవాణా అరికట్టడానికి ఆ దేశ భూభాగంపై దాడులు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.


గత కొంత కాలంగా అమెరికా, వెనుజువెలా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. తాజాగా జరిగిన వరుస పేలుళ్లు.. అగ్రరాజ్యం పనేనని స్థానిక అధికారులు అనుమానిస్తున్నారు. కాకపోతే, ఈ పెలుళ్లపై పెంటగాన్, వైట్ హౌస్ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ట్రంప్ చెప్పింది చేసి ఉంటే మాత్రం.. వెనెజువెలా గడ్డపై అమెరికా జరిపిన మొదటి ప్రత్యక్ష దాడి ఇదే అంటున్నారు. ఈ దాడులు అక్రమ రవాణా స్థావరాలే లక్ష్యంగా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.


మారక ద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో డోనాల్డ్ ట్రంప్ గత కొంత కాలంగా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఒత్తిడి పెంచుతున్నారు. కరీబియన్ సముద్ర ప్రాంతాల్లో సైనిక బలగాలను మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారాన్ని అరికడతామని ట్రంపె హెచ్చరించారు. ఇప్పటికే పసిఫిక్, కరేబీయన్ సముద్రాల్లో అక్రమంగా డ్రగ్స్‌ను తరలిస్తున్న పడవలు, ఆయిల్ ట్యాంకర్లపై దాడులు నిర్వహిస్తుంది అమెరికా. పేలుళ్ల ధాటికి భయపడిన జనాలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

Updated Date - Jan 03 , 2026 | 03:32 PM