Share News

Mexico Earthquake: మెక్సికోలో భూ ప్రకంపనలు.. ఇద్దరు మృతి

ABN , Publish Date - Jan 03 , 2026 | 10:31 AM

మెక్సికోలో భారీ భూ ప్రకంపనలతో ప్రజలు గజ గజ వణికిపోయారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు.

Mexico Earthquake: మెక్సికోలో భూ ప్రకంపనలు.. ఇద్దరు మృతి
Mexico Earthquake

ఇంటర్నెట్ డెస్క్: మెక్సికోలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) వెల్లడించింది. గెరేరో రాష్ట్రంలోని శాన్ మాక్రోస్‌కు సమీపంలోని అకాపుల్కో సిటీలో భూ ప్రకంపన కేంద్రాన్ని గుర్తించారు. భూ ప్రకంపన కేంద్రం భూమికి సుమారు పది కిలోమీటర్ల (6.21 మైళ్లు) లోతులో ఉన్నట్లు జీఎఫ్‌జడ్ అధికారులు తెలిపారు. తీవ్ర ప్రకంపనలతో మెక్సికో వణికిపోయింది. దీని ప్రభావం దక్షణ, మధ్య ప్రాంతాలపై కూడా పడింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇండ్లు, ఆఫీసులు వదిలి బయటకు పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనల తీవ్రతకు భవనాలు ఊగిపోయాయి.


భూ ప్రకంపనల నేపథ్యంలో మెక్సికో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రభావిత ప్రాంతాల్లోని స్థానిక యంత్రాంగంతో పాటు రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా చాలా ఇళ్లు దెబ్బతిన్నట్లు సమాచారం. పూర్తి నష్టం అంచనా వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ కొత్త ఏడాదిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్న సమయంలోనే భూ ప్రకంపనలు రావడంతో అందరూ ఉలిక్కి పడ్డారు. భూ ప్రకంపనల హెచ్చరిక సైరన్లు మోగడంతో సమావేశం మధ్యలోనే ఆపివేశారు. భద్రతా సిబ్బంది అలర్ట్ అయి షీన్‌బామ్‌తో పాటు జర్నలిస్టులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.


మెక్సికో అధ్యక్షురాలికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ప్రకంపనలు ఆగిపోవడంతో తిరిగి ప్రెస్‌మీట్ కొనసాగించారు. దీని తీవ్రతకు మెక్సికో సిటీలో పలు భవనాలు స్వల్పంగా పగుళ్లు ఏర్పడ్డాయి. అకాపుల్కో, మెక్సికో సిటీలో ఎక్కవ ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. గతంలో 1985, 2017 లో వచ్చిన భారీ భూ ప్రకంపనలతో వేల సంఖ్యల్లో మరణాలు సంభవించాయి.


ఇవి కూడా చదవండి..

షారూక్ ఖాన్ నాలుక కత్తిరిస్తే.. రివార్డు ప్రకటించిన హిందూ మహాసభ నేత

మన పొరుగున చెడ్డోళ్లున్నారు.. పాక్‌పై జైశంకర్ పంజా

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 03 , 2026 | 10:52 AM