Tossing Cash Into The Air: ట్రక్కు నిండా కుప్పలుగా డబ్బు.. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరేశాడు..
ABN , Publish Date - Nov 01 , 2025 | 03:39 PM
ఓ వ్యక్తి డబ్బులతో నిండిన ట్రక్కులో నిలబడ్డాడు. రెండు చేతులతో పెద్ద మొత్తంలో డబ్బు ఎత్తి కిందపడేశాడు. అక్కడ ఉన్న వారు మాత్రం ఆ డబ్బును పెద్దగా పట్టించుకోలేదు.
రోడ్డు మీద ఒక రూపాయి కనిపించినా ఠక్కున తీసుకుని జేబిలో పెట్టుకునే వారు ఇండియాలో ఎంతో మంది ఉన్నారు. అలాంటిది నేలపై కుప్పలు తెప్పలుగా డబ్బు పడుంటే ఊరికే ఉంటారా?.. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేశంలో చుట్టూ కుప్పలు తెప్పలుగా నోట్లు పడున్నా జనం మాత్రం పెద్దగా పట్టించుకోవటం లేదు. ఓ వ్యక్తి ట్రక్కు నిండా డబ్బులు తెచ్చి రోడ్డుపై చల్లినా జనం మాత్రం తీసుకోవటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది?.. ఆ డబ్బుల్ని జనం ఎందుకు పట్టించుకోవటం లేదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
వెనిజులా దేశంలో తీవ్రమైన ద్రవ్యోల్బణం వచ్చింది. డబ్బుకు విలువ లేకుండా పోయింది. చిన్న వస్తువు కొనాలన్నా కట్టల కట్టల డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. తాజాగా సిటీ స్క్వయర్ దగ్గర ఓ వ్యక్తి డబ్బులతో నిండిన ట్రక్కులో నిలబడ్డాడు. రెండు చేతులతో పెద్ద మొత్తంలో నోట్లను పట్టి గాల్లోకి విసిరేశాడు. ట్రక్కు ఉన్న ప్రదేశం చుట్టూ పెద్ద మొత్తంలో నోట్లు పడున్నాయి. జనం మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కొంతమంది మాత్రం వాటితో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.
కాగా, వెనిజులా గత కొన్నేళ్లుగా తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ డబ్బులు చిత్తు కాగితాలతో సమానం అయ్యాయి. ఆహారం, మెడిసిన్స్, ఇంధనాల ధరలు ఆకాశాన్ని అంటాయి. అందుకే అక్కడి జనం ఫారెన్ కరెన్సీపై ఆధారపడి బతుకుతున్నారు. యూఎస్ డాలర్లను ఎక్కువగా వాడుతున్నారు. వాటితోటే నిత్యావసర సరుకులు కొంటూ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఈ పిల్లలు బాల మేధావులు.. ఇంత చిన్న వయసులోనే..
మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో ఏనుగును 10 సెకెన్లలో కనిపెట్టండి..