Home » Uttar Pradesh
అయోధ్యలో రామజన్మభూమి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వేదాంతి కీలక భూమిక పోషించారు. పలు ర్యాలీలు, కార్యక్రమాలతో ప్రజామద్దతును కూడగట్టారు.
దగ్గు మందు రాకెట్ కేసుతో సంబంధం ఉన్న ఉత్తర ప్రదేశ్లోని లక్నోకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అలోక్ను కొద్దిరోజుల క్రితం అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, లక్నోలోని అతడి ఇంటిపై రైడ్ చేశారు. అత్యంత ఖరీదైన అతడి ఇంటిని చూసి అధికారులే షాక్ అయ్యారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్, ఇతర నేతల సమక్షంలో పంకజ్ చౌదరి ఎన్నికను పీయూష్ గోయెల్ ప్రకటించారు.
పదవి పెద్దదా చిన్నదా అనేది ముఖ్యం కాదని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా ఒక కార్యకర్తగా అంకిత భావంతో తాము పనిచేస్తామని పంకజ్ చౌదరి తెలిపారు.
ఉత్తర ప్రదేశ్లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. బైకుపై వెళుతున్న ఓ యువకుడు రోడ్డుపై వెళుతున్న ఓ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు.
హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు చేరుకున్న అఖిలేశ్.. యాదవ సంఘాల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నా యాదవులంతా ఒక్కటేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా నెట్టింట వెతికేస్తున్నారు. ఒక రకంగా ఉదయం లేచిన మొదలు.. రాత్రి పడుకునే వరకూ మనిషి జీవితంలో సోషల్ మీడియా ఒక భాగం అయ్యింది.
ఓ వ్యక్తి రైలు పైకి ఎక్కాడు. హై టెన్షన్ వైర్ల కింద నడవసాగాడు. అతడు చేతులు పైకి ఎత్తి ఉంటే ప్రాణాలు పోయేవి. ఇలాంటి సమయంలో రైల్వే పోలీసు దేవుడిలా వచ్చి అతడ్ని కాపాడాడు.
అయోధ్య రామాలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తాను రుణపడి ఉంటానని, ఈ రోజు (డిసెంబర్ 6) చాలా కీలకమైన రోజని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. వివాదాస్పద కట్టడం (బాబ్రీ మసీదు) తొలగించామని, తద్వారా దేశ సమున్నత వారసత్వాన్ని పునరుద్ధరించడానికి మార్గం సుగమమైందని చెప్పారు.
ఉత్తర ప్రదేశ్లోని వారణాసికి చెందిన భార్యాభర్తలు చంటి బిడ్డ మల, మూత్రాలు ఉండే డైపర్లను తీసి నిత్యం ఇంటి ముందు ఉండే చెట్టుపై వేస్తూ ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 100 దాకా డైపర్లతో ఆ చెట్టు డైపర్ల చెట్టుగా మారింది.