Share News

ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం.. రీల్స్ పిచ్చి మహిళ ప్రాణాలు తీసింది..

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:25 PM

సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఈ మధ్య చాలా మంది రీల్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు రీల్స్ పిచ్చితో చేసే వీడియోలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అలాంటి ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం.. రీల్స్ పిచ్చి మహిళ ప్రాణాలు తీసింది..
Uttar Pradesh Reels Tragedy

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో పాపులర్ కావాలని కొంతమంది రీల్స్ చేస్తూ ప్రాణాలమీద‌కు తెచ్చుకుంటున్న సంఘటనలు తరుచూ జరుగుతున్నాయి. ఒక మహిళ ఉరి వేసుకుంటున్నట్లు రీల్స్ చేయాలని ప్రయత్నించింది. అది కాస్తా బెడిసికొట్టడంతో చివరికి ప్రాణాలు కోల్పోయింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన మోహిని(27)కి సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అలవాటు. ఈ క్రమంలోనే తన ఇంట్లో ఉరి వేసుకుంటున్నట్లు నటించే ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాలని నిర్ణయించుకుంది. దీనికోసం మెడకు తాడు బిగించుకుని ఓ స్టూల్‌పై నిల్చుని తన మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించింది. కానీ క్షణాల్లోనే పరిస్థితి విషాదకరమైన మలుపు తిరిగింది. స్టూల్‌ బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది. దీంతో ఆమె మెడకు తాడు బిగుసుకుని క్షణాల్లో ప్రాణాలు కోల్పోయింది.


ఈ విషయాన్ని గమనించిన నాలుగేళ్ల కూతురు.. గట్టిగా కేకలు వేయడంతో పొరుగువారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రీల్స్ చిత్రీకరించే సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసు.. అసలు నిజాన్ని బయటపెట్టిన పోలీసులు..

ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం

Read Latest Telangana News and National News

Updated Date - Feb 07 , 2026 | 04:58 PM