రూ.85 లక్షల బంగారు నగలిచ్చి మోమోలు తిన్నాడు.. అసలేం జరిగిందంటే..?
ABN , Publish Date - Feb 02 , 2026 | 08:46 PM
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ ఘటన అందరినీ ఆశ్చర్య పరిచింది. మోమోల పట్ల ఒక బాలుడికి ఉన్న ఇష్టాన్ని గ్రహించి వ్యాపారులు మోసానికి పాల్పడ్డారు. ఆ బాలుడిని ట్రాప్ చేసిన వ్యాపారులు ఏకంగా రూ.85 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను కాజేశారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా పిల్లలు స్ట్రీట్ ఫుడ్(Street food) అంటే చాలా ఇష్టపడతారు. ఆ ఇష్టమే ఓ బాలుడి కొంప ముంచింది. మోమోల(Momo) పట్ల బాలుడికి ఉండే ఇష్టాన్ని గ్రహించిన వ్యాపారులు అతన్ని ట్రాప్ చేశారు. ఇంట్లో బంగారు ఆభరణాలు(Gold jewelry) తెచ్చి ఇస్తే.. మోమోలు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తామని ప్రలోభపెట్టారు. అలా రోజూ స్కూల్‌కి వెళ్తూ మోమోలు తినేవాడు.. అందుకోసం ఇంటి నుంచి నగలు తెచ్చి వ్యాపారులకు ఇచ్చేవాడు. అలా ఏకంగా రూ.85 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు బాలుడి నుంచి వ్యాపారుల కాజేశారు. ఆ ఘటన ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని డియోరియాలో జరిగింది.
విమ్లేష్ మిశ్రా వారణాసిలో ఒక ఆలయంలో పూజారిగా ఉన్నారు. ఆయన కుమారుడు 7వ తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడికి మోమోలంటే ఎంతో ఇష్టం. మోమోలు అమ్మే వ్యాపారులు ఆ బాలుడి బలహీనతను ఆసరా చేసుకొని ఇంట్లో బంగారు ఆభరణాలు తెచ్చి ఇస్తే ఫ్రీగా మోమోలు ఇస్తామని ఆశపెట్టారు. దీంతో ఆ బాలుడు స్కూల్‌కి వెళ్లే సమయంలో నగలు తెచ్చి వ్యాపారులకు ఇస్తూ ఫ్రెండ్స్ తో ఉచితంగా మోమోలు తినేవాడు.
విమ్లేష్ మిశ్రా సోదరి ఇటీవల వారి ఇంటికి వచ్చి తన నగలు తిరిగి ఇవ్వాలని అడిగింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు బీరువా తెరిచి చూడగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అందులో రూ.85 లక్షల విలువ చేసే నగలు కనిపించకుండా పోయాయి. వెంటనే బాలుడిని పిలిచి ప్రశ్నించగా మోమోలు తినడం కోసం వ్యాపారులకు నగలు ఇచ్చానని చెప్పాడు. అది విన్న కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వెంటనే ముగ్గురు వ్యాపారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంలోని అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. రాజ్‌నాథ్, అమిత్‌షా అభ్యంతరం
సీజే రాయ్ కేసు.. వెలుగులోకి 9 పేజీల సూసైడ్ నోట్