ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంలోని అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. రాజ్‌నాథ్, అమిత్‌షా అభ్యంతరం
ABN , Publish Date - Feb 02 , 2026 | 02:30 PM
విపక్ష నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన పుస్తకంలోని ఒక వాక్యాన్ని ప్రస్తావించడంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే అడ్డుకున్నారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో సోమవారంనాడు గందరగోళం తలెత్తింది. విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన ప్రసంగంలో ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన పుస్తకంలోని ఒక వాక్యాన్ని ప్రస్తావించడంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే అడ్డుకున్నారు. నరవణే పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని, ప్రచురితం కాని పుస్తకం నుంచి వ్యాఖ్యలను పార్లమెంటరీ ప్రొసీడింగ్స్‌లో ఎలా ప్రస్తావిస్తారని నిలదీశారు. సబ్జెక్ట్‌పై మాట్లాడాలన్నారు.
రాజ్‌నాథ్ సింగ్ లేవనెత్తిన అభ్యంతరాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమర్థించారు. 'మ్యాగజైన్ ఏదైనా రాయవచ్చు. పుస్తకం అధికారికంగా ప్రచురితం కానప్పడు దానికి విశ్వసనీయత ఉండదు' అని అన్నారు. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాహుల్ మాట్లాడటం సరికాదన్నారు. పార్లమెంటరీ విధివిధానాలను పాటించాలని సూచించారు. దీంతో స్పీకర్ జోక్యం చేసుకుని ఆ పుస్తకం ఎక్కడుందో చూపించాలని అడిగారు. ప్రతిపక్ష నేతగా మీరు ఆరోపణలు చేస్తున్నారే కానీ సభ నిబంధనలను పాటించడం లేదన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. దీంతో రాహుల్ వెంటనే స్పందించారు. 'ఏమి మాట్లాడమంటారో దయచేసి మీరే చెప్పండి' అన్నారు. దీనిపై స్పీకర్ వెంటనే జవాబిచ్చారు. నేను మీ సలహాదారుని కాదు. స్పీకర్‌గా సభ సజావుగా సాగేలా చూడటం నా బాధ్యత. నిర్దేశించిన సబ్జెక్ట్ మీదే చర్చ ఉండాలి' అన్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి..
జమ్ముకశ్మీర్‌లో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం
రోహిత్ శెట్టికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్.. అది ట్రైలర్ మాత్రమే..