రోహిత్ శెట్టికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్.. అది ట్రైలర్ మాత్రమే..
ABN , Publish Date - Feb 02 , 2026 | 10:14 AM
రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులకు కుట్ర చేసింది మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అని తేలింది. బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన శుభం లంగ్‌కోర్, అర్జు బిష్ణోయ్, హరి బాక్సర్‌లు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
ముంబై, ఫిబ్రవరి 2: బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి వద్ద ఆదివారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడిన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఐదుగురు నిందితులను అమన్ ఆనంద్ మరోట్, స్వప్నిల్ బంధు సాకేత్, సిద్ధార్థ్ దీపక్ ఐన్‌పురే, సమర్థ్ శివ్ శరణ్ పోమాజీ, ఆదిత్య జ్ణానేశ్వర్‌గా గుర్తించారు. ఆదివారం రాత్రి వారిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి ఫిబ్రవరి 5 వరకు పోలీస్ కస్టడీ విధించింది. నిందితులు రోహిత్ శెట్టిని భయపెట్టాలన్న ప్లాన్‌తో జుహులోని ఆయన ఇంటిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర
రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులకు కుట్ర చేసింది మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అని తేలింది. బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన శుభం లంగ్‌కోర్, అర్జు బిష్ణోయ్, హరి బాక్సర్‌లు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో.. ‘రోహిత్ శెట్టిని చాలా సార్లు హెచ్చరించాం. మా పనికి అడ్డం రావద్దని చెప్పాం. అతడు మా మాటల్ని లెక్కచేయలేదు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇప్పటికి కూడా అతడు అర్థం చేసుకోకపోతే.. ఈసారి బుల్లెట్లు ఇంటి గోడల మీద కాదు.. బెడ్రూంలో అతడి గుండెలపై పేలుస్తాం’ అని అన్నారు.
కాగా, శుభం లంగ్‌కోర్.. బాబా సిద్ధిఖీ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. శుభం చెప్పినందువల్లే సమర్థ్ శివ్ శరణ్ పోమాజీ.. రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు జరపడానికి పూనుకున్నాడు. మిగిలిన నిందితులతో కలిసి పక్కా ప్లాన్ వేశాడు. ప్రధాన షూటర్ అమన్ ఆనంద్ మరోట్ మరో నిందితుడితో కలిసి స్కూటర్‌పై రోహిత్ శెట్టి ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇంటి గోడపై నాలుగు రౌండ్లు కాల్పలు జరిపాడు. ఆ వెంటనే ఇద్దరూ అక్కడినుంచి పరారయ్యారు. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. సాయంత్రానికే ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
బంగారం @ 9 వేలు, వెండి @ 50 వేలు.. భారీగా పతనమైన ధరలు..