Share News

బంగారం @ 9 వేలు, వెండి @ 50 వేలు.. భారీగా పతనమైన ధరలు..

ABN , Publish Date - Feb 02 , 2026 | 09:46 AM

బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొనుగోలుదారులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు గత నాలుగైదు రోజులుగా అంతే స్థాయిలో పతనమవుతున్నాయి

బంగారం @ 9 వేలు, వెండి @ 50 వేలు.. భారీగా పతనమైన ధరలు..
Gold and silver prices crash

బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొనుగోలుదారులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు గత నాలుగైదు రోజులుగా అంతే స్థాయిలో పతనమవుతున్నాయి. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరుగుతుండడమే దీనికి కారణంగా కనిపిస్తోంది (Gold prices Live).


ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 2న) ఉదయం 9:30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,51,530కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా 9,050 రూపాయలు తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,900కి చేరింది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే 8,300 రూపాయలు తగ్గింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,51,680కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,39,050కి చేరుకుంది.


మరోవైపు ఇటీవల భారీగా పెరిగిన వెండి కూడా వేగంగా పతనమవుతోంది. ఐదు రోజుల క్రితం రూ.4.25 లక్షలకు చేరిన కిలో వెండి కొద్ది రోజుల్లోనే తిరిగి రూ.3 లక్షలకు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు రూ.50 వేల మేర తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కిలో వెండి ధర రూ.3 లక్షలుగా ఉంది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి..

అమెరికాకు వార్నింగ్.. ఇరాన్‌పై దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధం తప్పదంటున్న ఖమేనీ..


స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 02 , 2026 | 09:46 AM