లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Feb 02 , 2026 | 10:07 AM
కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఆదివారం నాడు భారీగా పతనమైన దేశీయ సూచీలు సోమవారం కోలుకున్నాయి. ఓ మోస్తరు నష్టాలతో ప్రారంభమమైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి ప్రవేశించాయి. మళ్లీ 81 వేల మార్క్‌కు చేరుకున్నాయి.
కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఆదివారం నాడు భారీగా పతనమైన దేశీయ సూచీలు సోమవారం కోలుకున్నాయి. ఓ మోస్తరు నష్టాలతో ప్రారంభమమైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి ప్రవేశించాయి. మళ్లీ 81 వేల మార్క్‌కు చేరుకున్నాయి. అయితే అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, బడ్జెట్ విశ్లేషణల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. కనిష్టాల వల్ల మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాబాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (80,722)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 150 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి ఎగబాకింది. ఒక దశలో 500 పాయింట్లకు పైగా లాభపడి 81 వేల మార్క్ దాటింది. అయితే ఆ తర్వాత అమ్మకాల కారణంగా కిందకు దిగి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 183 పాయింట్ల లాభంతో 80,906 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 27 పాయింట్ల లాభంతో 24,852 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో జీఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్, బీఎస్‌ఈ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రో, లోథా డెవలపర్స్, నాల్కో మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఆయిల్ ఇండియా, భారత్ డైనమిక్స్, హడ్కో, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, శ్రీరామ్ ఫైనాన్స్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 11 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 208 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.60గా ఉంది.
ఇవి కూడా చదవండి..
అమెరికాకు వార్నింగ్.. ఇరాన్‌పై దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధం తప్పదంటున్న ఖమేనీ..
స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..