Share News

కొరియన్ పేర్లతో సోషల్ మీడియా అకౌంట్.. తండ్రి ఆగ్రహంతో మరణం వైపు..

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:02 AM

నిషిక, ప్రాచీ, పఖీలు తమను తాము పూర్తిగా కొరియన్స్‌గా భావించారు. తమ పేర్లు, వేషధారణనూ మార్చుకున్నారు. మారియా, అలిజా, సిండీ అనే కొరియన్ పేర్లతో సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేశారు.

కొరియన్ పేర్లతో సోషల్ మీడియా అకౌంట్.. తండ్రి ఆగ్రహంతో మరణం వైపు..
Ghaziabad sisters

ఇంటర్‌నెట్ డెస్క్‌: ఉత్తర్ ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యకు సంబంధించిన కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్కాచెల్లెళ్ల మరణానికి ఆన్‌లైన్ కొరియన్ గేమ్ కారణం కాదని తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిషిక, ప్రాచీ, పఖీలు తమను తాము పూర్తిగా కొరియన్స్‌గా భావించారు. తమ పేర్లతో సహా వేషధారణనూ మార్చేశారు. మారియా, అలిజా, సిండీ అనే కొరియన్ పేర్లతోటే సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేశారు. కొద్దిరోజుల్లోనే వారికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. పది రోజుల క్రితం కూతుళ్ల సోషల్ మీడియా అకౌంట్ గురించి తండ్రి చేతన్ కుమార్‌కు తెలిసింది.


ఈ విషయమై తండ్రి చేతన్ ఆగ్రహానికి గురయ్యాడు. వారి మొబైల్ ఫోన్స్ లాక్కున్నాడు. అకౌంట్‌ను డిలీట్ చేశాడు. అప్పటికే.. చేతన్ కుమార్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కారణంగా 2 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రెండేళ్ల నుంచి పిల్లల్ని స్కూలుకు పంపడం లేదు. కరెంట్ బిల్ కట్టడం కోసం పిల్లల మొబైల్ ఫోన్స్‌ను అమ్మేశాడు. పిల్లలు తమ ఫోన్ల గురించి పదే పదే అడగ్గా వారిపై కోప్పడ్డాడు. పెళ్లి చేసి పంపించేస్తానని హెచ్చరించాడు. తండ్రి బెదిరింపులకు వారు భయపడలేదు. ‘మేము భారతీయులం కాదు కొరియన్లం. మేము పెళ్లి చేసుకోము’ అని చెప్పారు. సరిగ్గా పది రోజుల తర్వాత సూసైడ్ చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.


ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు..

చేతన్ కుమార్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు పిల్లలు పుట్టకపోవడంతో ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు ముగ్గురు పిల్లలు పుట్టారు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్యకూ ఇద్దరు పిల్లలు పుట్టారు. చేతన్ కుమార్.. ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలతో ఒకే ఇంట్లో ఉంటున్నాడు. కొరియన్ కల్చర్‌కు ప్రభావితమై ప్రాణాలు తీసుకున్న ముగ్గురిలో ఒకరు మొదటి భార్య కూతురు కాగా.. మిగిలిన ఇద్దరు రెండో భార్య కూతుళ్లు.


ఇవి కూడా చదవండి

నమ్మించి నట్టేటా ముంచుతారా?

మునిసిపల్ పోరులో కీలకం కానున్న ఎక్స్ అఫీషియో ఓట్లు

Updated Date - Feb 05 , 2026 | 11:23 AM