Home » Uttar Pradesh
తన కుమార్తె అదితి యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద ఆన్‌లైన్ ప్రచారం జరుగుతుండటం, అభ్యంతకర సోషల్ మీడియా పోస్టులు రావడంపై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య, పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ మండిపడ్డారు. ప్రజా సమస్యల నుంచి దారిమళ్లించేందుకు బీజేపీ మద్దతుదారులే ఈ ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్‌పై కొందరు తప్పుడు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేయడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. సమాజంలో ఎవరి ఆడపిల్లపైనా ఒకటేనని, వారిని ఇలాంటి నీచమైన ప్రజా చర్చల్లోకి లాగకూడదని అన్నారు.
కూతురి ప్రేమ వివాహాన్ని అంగీకరించని ఓ తండ్రి మరీ కర్కశంగా ప్రవర్తించాడు. పోలీసుల ఎదుటే ఆమెను కత్తితో పొడిచి హతమార్చాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళితే...
సైనిక అధికారిగా నటిస్తూ జనాల్ని మోసగిస్తున్న ఒక యువకుడి కోసం ఉచ్చు పన్నిన ఆర్మీ అధికారులు తాజాగా అతడిని అరెస్టు చేశారు. యూపీలో ఈ ఘటన వెలుగు చూసింది.
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ పేరు అమేథీ జిల్లాలోని మైదాన్ మైవా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా నుంచి గల్లతైంది. 2024 లోక్‌సభ, 2022 అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఇదే ప్రాంతం నుంచి ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉంది.
దేశ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశ్వాసం లేని వారికి భారతదేశం ఎంతమాత్రం ధర్మశాల కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు (జూన్ 5) సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగి సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ప్రముఖ నటి హేమమాలినితోపాటు అనేకమంది ప్రముఖులు యోగికి శుభాకాంక్షలు చెప్పారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సెంట్రల్ జైలుకు వెళ్లటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం భార్యను తుపాకితో బెదిరించాడు.
యూపీలో టీనేజర్ హత్యపై రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. స్నేహం మాటున హింసాత్మక ఘటనలకు దిగితే సహించబోమని పేర్కొన్నారు.
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ కొందరు ముస్లిం మౌల్వీలు చేస్తున్న డిమాండ్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. చెప్పేదొకటి..చేసేదొకటి అనే రితీలో ద్వంద్వ ప్రమాణాలు తగదని హితవు పలికారు.