అయోధ్య రామ యంత్ర ప్రతిష్ఠలో పాల్గొన్న రాష్ట్రపతి.. బాలరామునికి పూజలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:08 PM
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయాన్ని గురువారం నాడు దర్శించారు. బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంపుల్ కాంప్లెక్స్‌లో 'రామ యంత్ర' ప్రతిష్ఠలో పాల్గొన్నారు.
అయోధ్య: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయాన్ని గురువారం నాడు దర్శించారు. బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంపుల్ కాంప్లెక్స్‌లో 'రామ యంత్ర' ప్రతిష్ఠలో పాల్గొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రాష్ట్రపతి వెంట ఉన్నారు.
ఆలయ నిర్మాణంలో పనిచేసిన సుమారు ఆరువేల మంది కార్మికులను, అంగడి వ్యాపారులను, కళాకారులను ఈ కార్యక్రమానికి రామజన్మభూమి ఆలయ ట్రస్టు ఆహ్వానించింది. శ్రీరామ యంత్రాన్ని రాష్ట్రపతి ప్రతిష్ఠించి, హారతి ఇచ్చారు. అనంతరం టెంపుల్ కాంప్లెక్స్‌లోని ఏడు ఆలయాలను ఆమె దర్శించారు. ఈరోజుతో రామ్‌లల్లా నిర్మాణం పూర్తి కావడం విశేషమని, యావద్దేశ ప్రజలే కాకుండా విదేశీయులు సైతం ఇక నుంచి పూర్తి ఆలయాన్ని దర్శించుకోవచ్చని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ తెలిపారు.
అయోధ్యలోని రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ 2023 జనవరి 22న జరిగింది. ఆ తర్వాతి సంవత్సరం 2024 మే 1న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా రామాలయాన్ని సందర్శించారు. మరోసారి ఉగాది పర్యదినం సందర్భంగా అయోధ్య రాముని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు రామ యంత్ర ప్రతిష్ఠాపనలో పాల్గొనడం విశేషం.
ఇవి కూడా చదవండి..
జలుక్‌బారీ నుంచి అస్సాం సీఎం పోటీ.. 88 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా
నామినేషన్ వేసిన కేరళ సీఎం పినరయి విజయన్