Share News

విజయాల ఉగాది.. దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

ABN , Publish Date - Mar 19 , 2026 | 09:41 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు.

విజయాల ఉగాది.. దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు
PM Modi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజలకు ఉగాది (UGADI) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు. వసంత రుతువు కొత్త శక్తికి, అవకాశాల స్ఫూర్తికి సంకేతమని అన్నారు. తదుపరి వ్యవసాయ చక్రానికి సిద్ధమవుతున్న రైతన్నలకు శుభాభినందనలు తెలిపారు. జీవితంలోని తీపి, చేదు, పులుపు వంటి రుచులన్నింటినీ సమానంగా స్వీకరించడమే ఉగాది సందేశమని, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, విజయాన్ని కృతజ్ఞతతో స్వీకరించాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ఉగాది పండుగ అద్దం పడుతుందని, ప్రజలందరి ప్రయత్నాలలో విజయాలు సిద్ధించి, శాంతి నెలకొనాలని ప్రధాని ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి..

శ్రీ పరాభవ నామ సంవత్సర రాశిఫలాలు (జన్మనక్షత్రం ఆధారంగా)

యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ: మంత్రి లోకేశ్

Updated Date - Mar 19 , 2026 | 10:08 AM