Share News

శ్రీ పరాభవ నామ సంవత్సర రాశిఫలాలు (జన్మనక్షత్రం ఆధారంగా)

ABN , Publish Date - Mar 15 , 2026 | 07:58 AM

శ్రీ పరాభవ నామ సంవత్సర రాశిఫలాలు (జన్మనక్షత్రం ఆధారంగా), శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

శ్రీ పరాభవ నామ సంవత్సర రాశిఫలాలు (జన్మనక్షత్రం ఆధారంగా)

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం)

ఆదాయం: 11, వ్యయం: 5; రాజపూజ్యం: 2, అవమానం: 4

mesham.jpgశ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగంలో, వ్యాపారంలో మార్పులకు ఈ ఏడాది అనుకూలం. బదిలీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు శుభప్రదం. పెండింగ్‌లో ఉన్న కోర్టు పనుల్లో కాస్త కదలిక మొదలవుతుంది. పరిశోధనలు, విదేశీ ప్రయాణాలకు అనుకూలం. వాహనాలు కొనుగోలు చేస్తారు. భూమి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.


ఈ ఏడాది గురువు 3,4.5 స్థానాలలో సంచరిస్తున్న ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామా లుంటాయి. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం అందుకుంటారు. స్టేషనరీ, రవాణా, పాఠశాలలు, మార్కెటింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. విదేశీ ప్రయాణాలకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు చేస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగు పడుతుంది. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదివేందుకు అనుకూలం. ఫలితంగా ఖర్చులు పెరుగుతాయి. రుణబాధలు తగ్గుతాయి. డిసెంబరు 13 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రగమనంలో ఉన్నందున ఆ సమయంలో వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో నిదానం పాటించాలి. విద్యార్థులు చదువుల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపాలి. వృత్తి, వ్యాపారాల్లో కొంత నిరుత్సాహంగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆడిటింగ్‌, క్రీడలు, సినిమా, టెలివిజన్‌ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి.


12వ స్థానంలో శని సంచారం వల్ల వాహనాలు, భూముల కొనుగోలుకు అనుకూలం. పరిశోధనా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదే శాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అఽధికం. అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. జూలై 27 నుంచి డిసెంబరు 11 వరకు శని వక్రగమనంలో ఉంటాడు. ఆ మాసాల్లో ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పట్టుదలతో ప్రయత్నించి లక్ష్యాలు సాధిస్తారు.

ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచారం కారణంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఉన్నతవిద్యకై చేసే యత్నాలు వాయి దావేసుకోవడం మంచిది. స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చేముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త స్నేహాలకు దూరంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి. షేర్లు, భాగస్వామ్యాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. సన్నిహితుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

శ్రీకృష్ణ భగవానుడి ఆరాధన శుభప్రదం.


వృషభం (కృత్తిక 2,3,4; రోహిణి; మృగశిర 1,2 పాదాలు)

ఆదాయం: 5, వ్యయం: 14; రాజపూజ్యం: 5, అవమానం: 4

vrushabham.jpgవృషభ రాశివారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్‌లు అందుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. గృహ యోగం ఉంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తిని పెంపొందించుకుంటారు. కొత్త స్నేహాలు, పరిచయాలు లాభిస్తాయి. గౌరవ మర్యాదలు అందుకుంటారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. సినిమాలు, టెలివిజన్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాల కారణంగా కొంత నష్టపోయే ప్రమాదం ఉంది.


ఈ ఏడాది 2,3,4 స్థానాల్లో బృహస్పతి సంచరిస్తున్న ఫలితంగా విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణానికి అనుకూలం. స్టీలు, సిమెంట్‌ ఇతర నిర్మాణ సామగ్రి వ్యాపారులు, ఫర్నిచర్‌ రంగాల వారు లాభాలు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. ప్రమోషన్లు అందుకుంటారు. డిసెంబరు 14 నుంచి సంవత్పరాంతం వరకు గురువు వక్రగమనంలో ఉంటాడు. ఆ సమయంలో ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రియల్‌ ఎస్టేట్‌, గృహనిర్మాణ రంగాల వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. న్యాయపరమైన సమస్యలు తలెత్తవచ్చు. పై అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. సన్నిహితులతో మనస్పర్థలు ఏర్పడే ప్రమాదం ఉంది.


ఏడాది మొత్తం మీ లాభస్థానంలో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా శాస్త్ర సాంకేతిక రంగాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయ భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. రుణబాధలు అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. మోకాళ్లు, కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి. శతృబాధ అధికం. జూలై27 నుంచి డిసెంబరు 11 వరకు శని వక్రగమనంలో ఉన్న సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువైనా చివరకు విజయం సాధిస్తారు.

ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచారం కారణంగా విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఉద్యోగంలో బదిలీలు అసంతృప్తి కలిగిస్తాయి. లక్ష్య సాధనలో సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. తల్లి ఆరోగ్యం లేదా తల్లిదండ్రుల ఆస్తులకు సంబంఽధించిన విషయాల్లో చికాకులు ఎదురవుతాయి. ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉంది.

శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.


మిథునం (మృగశిర 3,4; ఆరుద్ర; పునర్వసు 1,2,3 పాదాలు)

ఆదాయం: 8, వ్యయం: 11; రాజపూజ్యం: 1, అవమానం: 7

mithunam.jpgశ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశివారికి ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కోరుకున్న చోటికి బదిలీ అవుతారు. వాహనయోగం ఉంది. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. కమ్యూనికేషన్లు, రవాణా, టీచింగ్‌, బ్యాంకింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కన్సల్టెన్సీలు, ఆడిటింగ్‌ రంగాల వారు పురోగతి సాధిస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.


ఈ ఏడాది గురువు మీ జన్మరాశితో పాటు 2, 3 స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు ఫలిస్తాయి. సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాంధవ్యాలు బలపడతాయి. విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక, రాజకీయరంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. కుటుంబం విస్తరిస్తుంది. డిసెంబరు 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రగమనంలో ఉంటాడు. ఆ సమయంలో ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు అఽధికం. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి.


మీ జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచారం కారణంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు అందుకుంటారు. బదిలీలకు అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిళ్లు ఉన్నా ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. శని వక్రగమనంలో ఉన్న జూలై 27 - డిసెంబరు 11 తేదీల మధ్య ఉద్యోగంలో ఒత్తిళ్లు అధికం. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.

ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా బదిలీలు జరుగుతాయి. బదిలీల వల్ల మొదల్లో చిన్న ఇబ్బందులు ఎదురైనా ఆ తరువాత పరిస్థితి సర్దుకుంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు ఖర్చులు అధికం. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. డ్రైవింగ్‌లో నిదానం పాటించాలి. బంధుమిత్రుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. రవాణా రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

శ్రీ దక్షిణామూర్తి ఆరాధన మేలు చేస్తుంది.


కర్కాటకం (పునర్వసు 4; పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం: 2, వ్యయం: 11; రాజపూజ్యం: 4, అవమానం: 7

karkatakam.jpgకర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతంది. తోబుట్టువుల ఆస్తి వ్యవహారాల్లో చిన్నపాటి చికాకులు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అంచనాలు మించుతాయి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


మీ జన్మరాశి నుంచి 12,1,2 స్థానాల్లో గురుగ్రహ సంచారం కారణంగా ఈ ఏడాది స్థిరచరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వ్యాపారాల్లో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభప్రదం. కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. డిసెంబరు 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రగమనంలో ఉంటాడు. ఆ సమయంలో ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. ఉద్యోగ, వ్యాపారాల్లో నిదానం పాటించాలి. రవాణా, కన్సల్టెన్సీ, విద్యారంగాల వారు జాగ్రత్తగా ముందడుగు వేయాలి. కోర్టు వ్యవహారాలు కలవరం కలిగిస్తాయి. ఈ సమయంలో కొత్త ప్రయోగాలు వాయిదా వేసుకోవడం మంచిది.


ఈ ఏడాది మీ జన్మరాశి నుంచి 9వ స్థానంలో శని సంచారం జరుగుతున్నందున విద్యార్థులకు అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్తులకు సంబంధించిన కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. జూలై 27 - డిసెంబరు 14 తేదీల మధ్య శని వక్రించిన కారణంగా ఏకాగ్రత, పట్టుదలతో అవరోధాలను అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పాటించాలి. విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ చూపాలి.


ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. డ్రైవింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అపనిందలకు గురికావాల్సి వస్తుంది. అన్ని విషయాల్లో దూకుడు తగ్గించాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. క్రయవిక్రయాలకు అనుకూలం కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆహార నియమాలు పాటించాలి.

పరమేశ్వరుడి ఆరాధన శుభప్రదం.


సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)

ఆదాయం: 5, వ్యయం: 5; రాజపూజ్యం: 7, అవమానం: 3

simham.jpgశ్రీ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. శ్రీవారు, శ్రీమతి చొరవతో ఆర్థికంగా లాభిస్తుంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పది మందికి సహకారం చేస్తారు. ఇతరుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.


గురువు ఈ ఏడాది మీ జన్మరాశి నుంచి 11, 12, 1 స్థానాల్లో సంచారం చేస్తాడు. ఫలితంగా విద్య, న్యాయ, రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలాసాలకు ఖర్చులు అధికం. దూరప్రయాణాలకు అనుకూలం. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. పరిశోధకులకు అనుకూల సమయం. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. డిసెంబరు 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రించి ఉంటాడు. ఫలితంగా ఆ సమయంలో ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి ముందడుగు వేయాలి. కొత్త పరిచయాల కారణంగా అనుకోని చిక్కులు ఎదురవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది.


శని 8వ స్థానంలో సంచారం చేస్తున్న ఫలితంగా ఈ ఏడాది ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించాలి. ఆస్తి వ్యవహారాల్లో ఆనుకోని చిక్కులు ఎదురవుతాయి. తోబుట్టువులతో లావాదేవీల్లో నిదానంగా వ్యవహరించాలి. మధ్యవర్తిత్వానికి, ష్యూరిటీ, గ్యారెంటీలకు దూరంగా ఉండటం మంచిది. పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. రుణబాధలు అధికం. మోకాళ్లు, కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి. జూలై27 నుంచి డిసెంబరు 11 వరకు శని వక్రగమనంలో ఉన్న సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఎక్కువైనా చివరకు విజయం సాధిస్తారు.


ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వల్ల మనస్పర్థలు ఏర్పడతాయి. శతృబాధ పెరుగుతుంది. భాగస్వామి విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోతారు. వివాహం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి.

దుర్గాదేవి ఆరాధన వల్ల మేలు జరుగుతుంది.


కన్య (ఉత్తర 2,3,4; హస్త; చిత్త 1,2 పాదాలు)

ఆదాయం: 8, వ్యయం: 11; రాజపూజ్యం: 3, అవమానం: 3

kanya.jpgకన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రీడా రంగంలోని వారు విశేషంగా మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగం మార్పు విషయంలో మీ సంకల్పం నెరవేరుతుంది. విహార , వినోద యాత్రలు ఆనందం కలిగిస్తాయి. బృందకార్యక్రమాల కోసం వెచ్చిస్తారు. ఖర్చులు పెరుగుతాయి.


గురువు ఈ ఏడాది 10, 11, 12 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ప్రమోషన్లు లభిస్తాయు. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. రుణాలు మంజూరవుతాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం చేస్తూ వ్యాపారం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నించి విజయం సాధిస్తారు. డిజైనర్లు, పరిశోధకులు, ప్రచురణకర్తలు, న్యాయ, సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక, సేవా రంగాల్లోని వారు లక్ష్యాలు సాధిస్తారు. డిసెంబరు 14 నుంచి ఏడాది చివరి వరకు గురువు వక్రించి ఉండటంతో ఈ సమయంలో ఉద్యోగ, వ్యాపారాల్లో చిక్కులు ఎదురవుతాయి. పెద్దల సహకారం లోపించడంతో లక్ష్య సాధన కష్టంగా మారుతుంది. విదేశీ గమన ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉన్నత చదువుల కోసం ఖర్చులు అధికం. కొత్త ఆలోచనలు అమలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.


ఈ ఏడాది 7వ స్థానంలో శని సంచారం ఫలితంగా భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఆటంకాలు, ఆలస్యాలు చికాకు పెడతాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. రుణ భారం పెరుగుతుంది. అపనిందలు ఎదుర్కోవాల్సి రావచ్చు. గౌరవ, మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారంలో ఆర్థికపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. క్రయ విక్రయాల్లో నిదానం అవసరం. విద్యార్థులకు చదువుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. జూలై 27 - డిసెంబరు 11 తేదీల మధ్య శని వక్రించిన కారణంగా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ప్రమోషన్‌ అందుకుంటారు. పాత బకాయిలు వసూలవుతాయి. రుణ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది.


ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా వైద్య రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. బంధువుల వ్యవహారశైలి మనస్తాపం కలిగిస్తుంది. దూరప్రయణాలకు ఖర్చు చేస్తారు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.

శీతలా దేవి ఆరాధన శుభఫలితాన్నిస్తుంది.


తుల (చిత్త 3,4; స్వాతి; విశాఖ 1,2,3 పాదాలు)

ఆదాయం: 5, వ్యయం: 14; రాజపూజ్యం: 6, అవమానం: 3

tula.jpgశ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసేందుకు ఈ ఏడాది అనుకూలం. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళతారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టినా తగిన జాగ్రత్తలు తీసుకుని బయటపడతారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగ్‌ రంగాల వారు, రక్షణ, బోధన, ప్రచురణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


గురువు ఈ ఏడాది మీ జన్మ రాశి నుంచి 9, 10, 11 స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపార రంగంలోని వారు లాభాలు అందుకుంటారు. అధికారం, హోదా, గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయరంగంలోని వారు ఉన్నత పదవులు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. డిసెంబరు 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రించినందున అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆస్తినష్టం జరుగుతుంది. శతృబాధ అధికం. ఉద్యోగులు పైఅధికారుల నుంచి మాటపడాల్సి వస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలకు ఇది తగిన సమయం కాదని గ్రహించాలి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.


శని ఈ సంవత్సరం 6వ స్థానంలో సంచరిస్తున్న ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. శతృబాధ తగ్గుతుంది. పెద్దలు, సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఇతరులకు మంచి చేసేందుకు ప్రయత్నించి మాటపడతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. జూలై 27 - డిసెంబరు 10 తేదీల మధ్య శని వక్రించిన ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వైద్యం, ఫార్మా రంగాల వారికి ప్రోత్సాహకరం.


ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా ఆర్థికంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. ప్రేమవ్యవహారాలకు దూరంగా ఉండాలి. క్రయవిక్రయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒత్తిళ్లు అధికమౌతాయి. పెద్దల అభిప్రాయం తెలుసుకుని అందుకు అనుగుణంగా నడుచుకుంటే మంచి జరుగుతుంది.

ఆంజనేయ స్వామిని ఆరాధించడం వ ల్ల మేలు జరుగుతుంది.


వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఆదాయం: 11, వ్యయం: 5; రాజపూజ్యం: 2, అవమానం: 6

vruchikam.jpgశ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారం రంగంలోని వారు మెరుగైన లాభాలు ఆర్జిస్తారు. పై ఉద్యోగుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్లు లభిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేస్తారు. ఆస్తి వ్యవహారాల్లో చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. న్యాయ, రక్షణ, బోధన రంగాల వారు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ రంగాల వారు మంచి ఫలితాలు అందుకుంటారు.


గురువు 8, 9, 10 స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. సంతానప్రాప్తికి అనుకూలం. రవాణా, ప్లానింగ్‌, శిక్షణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. పెద్దల సహకారంతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. డిసెంబరు 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రించినందున మీ పురోగతి చూసి అసూయపడేవారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్లు పెరుగుతాయి. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. మీ గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగే ప్రమాదం ఉంది.


ఈ ఏడాది 5స్థానంలో శని సంచారం కారణంగా సంతానయోగం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమాను బంధాలు బలపడతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడిటింగ్‌, టెలివిజన్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. శతృబాధ అధికం. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. జూలై 27 - డిసెంబరు 11 తేదీల మధ్య శని వక్రించిన ఫలితంగా విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. వ్యాపారాల విస్తరణకు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలం కాదు. ప్రియతములతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. టెలివిజన్‌, కళలు, క్రీడల రంగాల వారికి అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి.


ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా ఉద్యోగ వ్యవహారాల్లో పై అధికారుల కారణంగా చికాకులు ఎదురవుతాయి. బదిలీలు, మార్పుల కారణంగా ఒత్తిడికి లోనవుతారు. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలి. డ్రైవింగ్‌కు దూరంగం ఉండటం మేలు. కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి.

శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించడం మంచిది.


ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)

ఆదాయం: 14, వ్యయం: 11; రాజపూజ్యం: 5, అవమానం: 6

dhanussu.jpgధనుస్సు రాశివారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ఇంట్లో వేడుకలు, శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెంపొందించు కుంటారు. రుణాలు మంజూరవుతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాల వల్ల ప్రయోజనం పొందుతారు.


ఈ ఏడాది 6, 7, 8 స్థానాల్లో గురుసంచారం ఫలితంగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. శ్రీవారు, శ్రీమతి విషయాలలో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు లక్ష్య సాధనలో సహకరిస్తారు. స్పెక్యులేషన్లు, షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. రుణాలు తీర్చగలుగుతారు. ఉమ్మడి వ్యాపారం కలిసివస్తుంది. విద్యార్థులకు శుభప్రదమైన కాలం. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ప్రకటనలు, ఏజెన్సీ రంగాల వారికి అనుకూలం. రాజకీయ, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. డిసెంబరు 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రించిన ఫలితంగా వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.


ఈ ఏడాది 4వ స్థానంలో శని గ్రహ సంచారం ఫలితంగా కుటుంబ వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న చోటికి బదిలీ అవుతారు. ప్రమోషన్లు అందుకుంటారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం వారికి ప్రోత్సాహకరం. హార్డ్‌వేర్‌, కలప, ఫర్నిచర్‌, పెట్రోలు, ఇనుము వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అర్ధాష్టమ శని కారణంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. శని వక్రించిన జూలై 27 - డిసెంబరు 11 తేదీల మధ్య వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. ఓరిమితో అందరినీ ఒప్పించేందుకు యత్నించి విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే యత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.


ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీలు, మార్పులకు అనుకూలం. ఉన్నత విద్య కోసం ఖర్చులు అంచనాలు మించిపోతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. తోబుట్టువులు, బంధుమిత్రులతో అనుకూలంగా ఉంటుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో నిదానం అవసరం.

పార్వతీ దేవిని ఆరాధించడం మంచిది.


మకరం (ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం; ధనిష్ఠ 1,2 పాదాలు)

ఆదాయం: 2, వ్యయం: 8; రాజపూజ్యం: 1, అవమానం: 2

makaram.jpgమకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వ్యాపారాల ప్రారంభానికి, నూతన భాగస్వామ్యాలకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, హోటల్‌ రంగాల వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా కొంత నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.


మీ జన్మరాశి నుంచి 6, 7, 8 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా విద్యలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆటపాటలపై దృష్టి సారించి విద్యను ఆశ్రద్ధ చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆస్తి కొనుగోలు ఆలోచనలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం మందగిస్తుంది. కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. డిసెంబరు 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రించిన సమయంలో ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో చేసే యత్నాలు సఫలమవుతాయి. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. హోటల్‌, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆస్పత్రులు, కేటరింగ్‌, నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఉన్నత చదువుల్లో విజయం సాధిస్తారు. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. రుణాలు తీర్చగలుగుతారు.


మీ జన్మరాశి నుంచి 3వ స్థానంలో శని సంచారం ఫలితంగా బదిలీలు, సీట్ల మార్పిడి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు, స్థలం కొనుగోలు చేస్తారు. తోబుట్టువులు, సన్నిహితులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. శని వక్ర గమనంలో ఉన్న జూలై 27- డిసెంబరు 11 తేదీల మధ్య కుటుంబ విషయాల్లో చికాకులు అధికం. సంతానం విషయాలు ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థులకు చదువుల పట్ల అశ్రద్ధ పెరుగుతుంది. విలాసాలకు వెచ్చిస్తారు. ఆస్తి సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లో, కార్యాలయంలో బాధ్యతలు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. తోబుట్టువులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.

ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా క్రయవిక్రయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థికంగా పురోగతి ఉన్నా డబ్బు చేతిలో నిలబడదు. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగం మారే ఆలోచన ఉంటే దాన్ని వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ప్రయోగాలకు తగిన సమయం కాదు. ఆస్తిపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి.

శ్రీ దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.


కుంభం (ధనిష్ఠ 3,4; శతభిషం; పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఆదాయం: 2, వ్యయం: 8; రాజపూజ్యం: 4, అవమానం: 2

kumbham.jpgశ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. స్నేహబాంధవ్యాలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు అందుకుంటారు. పరిశ్రమలు, వ్యవసాయ రంగాలవారు మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పరిశోధనల్లో రాణిస్తారు. నేరపరిశోధన రంగంలోని వారు మంచి పేరు గడిస్తారు. నిర్మాణరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.


5,6,7 స్థానాల్లో గురువు సంచారం ఫలితంగా ఈ ఏడాది ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేస్తారు. శాస్త్ర, విజ్ఞానరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లల విద్య, వృత్తి, వివాహ విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. స్నేహానుబంధాలు బలపడతాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, విద్యాసంస్థలు, సినిమాలు, ప్రకటనలు, టెలివిజన్‌, క్రీడలు, సృజనాత్మక రంగాల వారు సత్ఫలితాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. డిసెంబరు 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్ర గమనంలో ఉన్న సమయంలో విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధ చూపే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లోపిస్తుంది. ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి.


జన్మరాశి నుంచి 2వ స్థానంలో శని సంచారం ఫలితంగా ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మందగిస్తుంది. పై అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయి. వేతనాలు పెరుగుతాయి. అందుకు తగ్గట్టుగానే ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సి రావచ్చు. అకారణంగా కలహాలు పెరుగుతాయి. ఫలితంగా కష్టాలు ఎదుర్కొంటారు. శ్రమకు తగిన ఫలితం కనిపించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సన్నిహితులతో విరోధం ఏర్పడే ప్రమాదం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. జూలై 27-డిసెంబరు 11 మధ్య శని వక్రించిన ఫలితంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారంలో మొదట ఇబ్బందులు ఎదురైనా చివరకు మంచి ఫలితాలు సాధిస్తారు.

ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా వైవాహిక జీవితంలో చికాకులు, మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. పందాలు, పోటీల్లో నష్టపోయే ప్రమాదం ఉంది. ఆర్థికపరమైన అంశాల్లో వేరే వారి జోక్యం కారణంగా నష్టపోతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వాహన ప్రయాణాలకు దూరంగా ఉండాలి. పెద్దల సలహా మేర నడుచుకుంటూ నష్ట తీవ్రతను తగ్గించుకునే వీలుంటుంది.

శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన మేలు చేస్తుంది.


మీనం (పూర్వాభాద్ర 4; ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం: 14, వ్యయం: 11; రాజపూజ్యం: 7, అవమానం: 5

meemam.jpgశ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. స్నేహబాంధవ్యాలు పెరుగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. స్థిరాస్తులు పెంపొందించుకుంటారు. చిన్నారుల విషయంలో శుభపరిణామాలు సంభవం. ప్రేమానుబంధాలు బలపడతాయి. సంవత్సరాంతంలో కొత్త వ్యాపారాలు, ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రయత్నించి విజయం సాధిస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, ఔషధ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


గురువు 4,5,6 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. బదిలీలు, మార్పులకు అనుకూలం. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. టెలివిజన్‌, సినిమాలు, క్రీడలు, ఆడిటింగ్‌, ప్రకటనలు, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. టీచింగ్‌, సాంకేతిక శిక్షణ, ఐటీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త ప్రయో గాలు చేసి విజయం సాధిస్తారు. ఆరోగ్యం పెంపొందించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. డిసెంబరు 14 నుంచి సంవత్స రాంతం వరకు గురువు వక్రించినందున ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. చిన్నారులు, ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు శ్రమకు తగిన ఫలితం కోసం అధికంగా శ్రమించాలి. సహోద్యోగుల సహకార లోపం ఫలితంగా లక్ష్య సాధన కష్టం అవుతుంది.

లగ్న శని సంచారం కారణంగ


ఈ వార్తలు కూడా చదవండి:

నేడు బంగారం ధరలు

గేమ్‌ చేంజర్‌ కారిడార్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 15 , 2026 | 07:58 AM