Share News

నేటి నుంచి 20 వరకు వానలు!

ABN , Publish Date - Mar 15 , 2026 | 07:16 AM

తెలంగాణలో ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు ద్రోణి ప్రభావంతో రెండు విడతల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నేటి నుంచి 20 వరకు వానలు!
Telangana Weather Report

  • 5 రోజుల పాటు తగ్గనున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు ద్రోణి ప్రభావంతో రెండు విడతల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ మధ్య ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు.


అలాగే ఈనెల 16 నుంచి 20వ తేదీ మధ్య కొన్ని జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశముందన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక శనివారం నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌లో అత్యధికంగా 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనూ 39 డిగ్రీల వరకు ఎండలు కాశాయి.


ఈ వార్తలు కూడా చదవండి

లంచాలు ఇవ్వలేక.. పదోన్నతులు కోల్పోతున్నాం

యాదాద్రి జిల్లాలో భువనగిరిలో దారుణం.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి

Updated Date - Mar 15 , 2026 | 08:57 AM