Share News

నావిక్‌ వ్యవస్థకు అంతరాయం!

ABN , Publish Date - Mar 15 , 2026 | 07:15 AM

అమెరికా జియో పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌) వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా భారత్‌ అభివృద్ధి చేసిన నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాంస్టలేషన్‌(నావిక్‌) వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది....

నావిక్‌ వ్యవస్థకు అంతరాయం!

నాలుగు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాల్లో ఒకటి విఫలం.. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ 1ఎఫ్‌లో చెడిపోయిన అణు గడియారాలు

  • రైళ్ల రియల్‌టైమ్‌ పొజిషన్‌, ప్రభుత్వ సేవలకు తీవ్ర విఘాతం

న్యూఢిల్లీ, మార్చి14: అమెరికా జియో పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌) వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా భారత్‌ అభివృద్ధి చేసిన నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాంస్టలేషన్‌(నావిక్‌) వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నావిక్‌ వ్యవస్థలో భాగమైన నాలుగు ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (ఐఆర్‌ఎన్‌ఎ్‌సఎ్‌స) ఉపగ్రహాల్లో ఒకటైన ఐఆర్‌ఎన్‌ఎ్‌సఎ్‌స 1ఎఫ్‌లోని అణు గడియారాలు చెడిపోయాయి. దీంతో దాని ద్వారా అందే పొజిషనింగ్‌, నావిగేషన్‌ సేవలు నిలిచిపోయాయి. ఈ ఉపగ్రహాన్ని 2016 మార్చి 10న ఇస్రో ప్రయోగించింది. దీని జీవిత కాలం పదేళ్లు కాగా.. ఈ నెల 10వ తేదీతో అది పూర్తయ్యింది. ఈ ఉపగ్రహంలోని మూడు అణు గడియారాల్లో రెండు చెడిపోవటంతో శుక్రవారం నుంచి నావిక్‌ సేవల్లో అంతరాయం తలెత్తిందని ఇస్రో వర్గాలు శనివారం ప్రకటించాయి.

11 ఉపగ్రహాల్లో పనిచేస్తున్నవి మూడే..

పాకిస్థాన్‌తో 1999లో కార్గిల్‌ యుద్ధం సమయంలో భారత సైన్యం జీపీఎస్‌ వ్యవస్థను వినియోగించేందుకు అమెరికా అనుమతించకపోవటంతో భారత్‌ సొంతంగా నావిగేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించి నావిక్‌కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 2013 నుంచి ఇప్పటివరకు రూ.2,250 కోట్ల వ్యయంతో 11 ఐఆర్‌ఎన్‌ఎ్‌సఎ్‌స ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. అయితే, వీటిలో ప్రారంభ దశలోనే ఆరు ఉపగ్రహాలు విఫలమయ్యాయి. ఒకదాని సేవలను ఉపసంహరించారు. ప్రయోగ సమయంలో రాకెట్లు విఫలం కావటంతో కొన్ని ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి వెళ్లలేకపోయాయి. గత గురువారం వరకు నాలుగు ఐఆర్‌ఎన్‌ఎ్‌సఎ్‌స 1బీ, 1ఎఫ్‌, 1ఎల్‌, 1జే సేవలందించాయి. ప్రస్తుతం మూడే పొజిషనింగ్‌, నావిగేషన్‌, టైమింగ్‌ (పీఎన్‌టీ) సేవలు అందిస్తున్నాయి. 1ఎఫ్‌ పీఎన్‌టీ సేవలకు పనికిరాకున్నా సాధారణ సందేశాలు అందించేందుకు ఉపయోగిస్తామని ఇస్రో వర్గాలు తెలిపాయి. కాగా, ఐఆర్‌ఎన్‌ఎ్‌సఎ్‌స 1ఐ ఉపగ్రహాన్ని సేవల నుంచి ఉపసంహరించారు.

అణు గడియారాలే సమస్య

నేవిగేషన్‌ సేవలు అందించే ఉపగ్రహాల్లో అణు గడియారాలే అత్యంత కీలకం. వీటిని మనదేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనేది. దాదాపు రూ.4.23 కోట్లతో యూరప్‌ దేశాల నుంచి 45 అణు గడియారాలు కొనుగోలు చే సింది. ఒక్కో ఉపగ్రహంలో మూడు గడియారాలు ఉంటాయి. ఈ మూడూ పనిచేస్తేనే ఉపగ్రహం పీఎన్‌టీ సేవలు అందించగలదు. అయితే, దిగుమతి చేసుకున్న ఈ అణు గడియారాల్లో లోపాలు ఉండటంతో ఉపగ్రహాలు పనికిరాకుండా పోతున్నాయి. దీంతో ఇటీవల ప్రయోగించిన నేవిగేషన్‌ ఉపగ్రహాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన అణు గడియారాలను వాడారు. నావిక్‌తో ఇప్పటికే 8,700 రైళ్లను అనుసంధానించారు. నావిక్‌ను భారత త్రివిధ దళాలు, ఇతర ప్రభుత్వ శాఖలు కూడా వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.


అణు గడియారం పాడైతే?

నేవిగేషన్‌ వ్యవస్థలో అత్యంత కీలకమైనది భూమిపై ఉన్న ఒక వస్తువు లేదా మనిషి స్థానాన్ని అత్యంత కచ్చితత్వంతో గుర్తించటం. ఉపగ్రహం అత్యంత కచ్చితత్వంతో చేయాలంటే అణు గడియారం కూడా కచ్చితత్వంతో పనిచేయాలి. వీటి పనితీరులో ఏమాత్రం తేడా వచ్చినా భూమిపై వస్తువు అసలు స్థానం నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చూపుతుంది. అయితే, అణు గడియారాలు పాడైన ఉపగ్రహాలను నావిగేషన్‌ పనులను మినహాయించి ఇతర సాధారణ సేవలకు వాడుకోవచ్చు. ప్రస్తుత నావిక్‌ వ్యవస్థ సరిగా పనిచేయాలంటే కచ్చితంగా నాలుగు ఐఆర్‌ఎన్‌ఎ్‌సఎ్‌స ఉపగ్రహాలు ఉండాలి. ప్రస్తుతం మూడే పనిచేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి...

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే

Updated Date - Mar 15 , 2026 | 07:15 AM