Share News

అసెంబ్లీ ఎన్నికలపై రేపు ప్రకటన?

ABN , Publish Date - Mar 15 , 2026 | 07:09 AM

తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై అతి త్వరలో షెడ్యూలు ప్రకటించే అవకాశాలున్నాయని...

అసెంబ్లీ ఎన్నికలపై రేపు ప్రకటన?

  • ఎలక్షన్‌ కమిషన్‌ వర్గాల వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై అతి త్వరలో షెడ్యూలు ప్రకటించే అవకాశాలున్నాయని ఎన్నికల కమిషన్‌ వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న ఈ షెడ్యూలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. గతఎన్నికల్లో మాదిరిగా పశ్చిమబెంగాల్‌లో 8 దశల్లో కాకుండా 5 లేదా 6 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని కమిషన్‌ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. అస్పాంలో రెండు దశల్లో, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఒకే రోజు పోలింగ్‌ నిర్వహిస్తారు. గతంలో కంటే భారీ ఎత్తున కేంద్ర బలగాలను మోహరించాలని కమిషన్‌ నిర్ణయించింది. దీనిపై కేంద్ర హోంశాఖతో చర్చలు జరుపుతోంది. పశ్చిమబెంగాల్‌ సహా మొత్తం అన్ని రాష్ట్రాల్లో రిటర్నింగ్‌ అధికారుల నియామకానికి నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి.

ఇవి కూడా చదవండి...

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే

Updated Date - Mar 15 , 2026 | 07:09 AM