Share News

ప్రియుడితో కలిసి అత్తను దారుణంగా చంపిన కోడలు

ABN , Publish Date - Mar 23 , 2026 | 10:50 AM

ప్రియుడి మోజులో ఓ కోడలు తన అత్తను అత్యంత దారుణంగా చేతులు, కాళ్లు కట్టేసి గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ప్రియుడితో కలిసి అత్తను దారుణంగా చంపిన కోడలు
Lucknow crime news

లఖ్‌నవూ, మార్చి 23: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా అనేక దారుణాలు జరుగుతున్నాయి. క్షణిక సుఖం కోసం తాళికట్టిన వాడితో సహా కుటుంబ సభ్యులను హత్య చేసేందుకు వెనుకాడటం లేదు. కొందరు మహిళలు అయితే ప్రియుడి మోజులో పడి.. కన్న బిడ్డలను కూడా హతమారుస్తున్నారు. తాజాగా ఓ కోడలు తన అత్తను అత్యంత దారుణంగా చేతులు, కాళ్లు కట్టేసి గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh Crime News)లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...


లఖ్‌నవూలోని నిషాత్ గంజ్ ప్రాంతంలో త్రిదేశ్, రంజన దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి ముగ్గురు పిల్లలు, త్రిదేశ్ తల్లి నిర్మలాదేవి కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. వీరి భవనంపైన గదిలో రాజన్ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో రంజనకు, రాజన్‌కు పరిచయం ఏర్పడి.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త బయటకు వెళ్లగానే వీరిద్దరు కలుస్తూ ఉండే వారు. వీరి వ్యవహారం రంజన అత్త నిర్మలా దేవి గుర్తించింది. ఇలాంటి పనులు ఆపాలని కోడలిని ఆమె హెచ్చరించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న రంజన చంపేందుకు పధకం రచించింది. ప్రియుడు రాజన్‌తో కలిసి రంజన.. చీరతో నిర్మలా దేవి చేతులు, కాళ్లు కట్టేసి..గొంతు నులిమి చంపేసింది.


అనంతరం ఇంట్లోని బంగారు నగలు ప్రియుడికి ఇచ్చి.. ఈ హత్యను దొంగలు చేసినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. గదిలో నానమ్మ మృతదేహాన్ని చూసిన త్రిదేశ్ పెద్ద కుమారుడు ఆదిత్య.. తండ్రికి సమాచారం ఇచ్చాడు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకున్నారు. మృతురాలి కుమారుడు త్రిదేశ్ ఫిర్యాదు మేరకు రాజన్, రంజనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రాజన్‌తో కలవద్దని తరచూ తన అత్త చెప్పినందుకే హత్య చేసినట్లు కోడలు రంజన పోలీసుల విచారణలో అంగీకరించింది. పోలీసులు నిందితులను కోర్టులో హాజరు పర్చారు.


ఇవి కూడా చదవండి:

ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా డైమిథైల్‌ ఈథర్‌

ఎల్‌పీజీతో ‘మంగళూరు’కు భారీ నౌక

Updated Date - Mar 23 , 2026 | 11:15 AM